పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(బి) (i) ప్రాచీన స్మారక చిహ్నములు మరియు పురాతత్త్వ స్థలముల అవశేషముల చట్టము, 1958 (1958లోని 24వ చట్టము ) యొక్క భావములోని ఏదేని ప్రాచీన స్మారక చిహ్నము పై గాని దానిలో గాని,

(ii) ఏదేని దేవాలయము పై గాని, విగ్రహముల ఉరేగింపు కొరకై ఉపయోగింపబడు లేక ఏదేని మత ప్రయోజనము కొరకు భద్రపరచబడు లేక ఉపయోగింపబడు ఏదేని రథము పై గాని, దానిలో గాని

శిల్పముగా మలచబడిన, చెక్కబడిన, రంగులతో చిత్రింపబడిన, లేక వేరు విధముగ రూపొందింపబడిన ఏదేని రూపణము.

లేబ్రాయపు వ్యక్తులకు అశ్లీలకరమైన వస్తువులను విక్రయించుట మొదలగునవి.

293. ఇరువది సంవత్సరముల లోపు వయసు గల ఏ వ్యక్తి కై నసు పై కట్ట కడపటి పరిచ్ఛేదములో నిర్దేశింపబడి నట్టి ఏదేని అశ్లీ లకరమైన వస్తువును విక్రయించు, కిరాయికిచ్చు, పంచి పెట్టు, ప్రదర్శించు లేక ప్రచారమునందు పెట్టుటలో అందజేయు, లేదా ఆట్లు జేయజూపు, లేక అట్లు చేయ ప్రయత్నించు వారేవరైనను మొదటి దోష స్థాపన పై మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను, రెండు వేల రూపాయల దాక ఉండగల జుర్మానా తోను, రెండవ లేక తరువాతి దోషస్థాపన జరిగిన సందర్భములో ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను, ఐదు వేల రూపాయలదాక ఉండగల జుర్మానాతో కూడను, శిక్షింపబడుదురు.

అశ్లీ లకరమై నకార్యములు మరియు పాటలు,

294. ఇతరులకు చికాకు కలుగునట్లుగా –

(ఏ) ఏదేని బహిరంగ స్థలములో ఏ అశ్లీ లకరమై న కార్యము నై నను చేయు,

(బీ) ఏదేని బహిరంగ స్థలములో గాని దానికి సమీపమున గాని ఏవేని అశ్లీ లకరమైనట్టి పాటలనుపాడు, కథా గేయములను పఠించు, మాటలను ఉచ్చరించు, వారెవరైనను మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

లాటరీ కార్యాలయమును ఏర్పరచుకొనుట,

294. ఎ రాజ్య లాటరీ, లేక రాజ్య ప్రభుత్వము ప్రాధికారమొసగిన లాటరీ కానట్టి లాటరీని నడుపు నిమిత్తము ఏదేని కార్యాలయమును లేక స్థలమును ఏర్పరచుకొనియుండు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

మరియు అట్టి ఏ లాటరీలో నై నను ఏదేని టికెట్టును, చీటీని, అంకెను లేక బొమ్మను తీయుటకు సంబంధించు నట్టి లేక వర్తించునట్టి ఏదేని సంఘటన, లేక ఆనిశ్చత పరిస్థితిపై ఆధారపడి ఏ వ్యక్తి యొక్క మేలు కొరకైనను ఏదేని సొమ్ము చెల్లించుటకు, లేక ఏదేని సరుకులను అందజేయుటకు, లేక ఏదేని పనిని చేయుటకు లేక ఏదేని పనిని చేయకుండుటకు ప్రతిపాదనను దేనినైనను ప్రచురించు వారెవరై సను, ఒక రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

అధ్యాయము ----15

మత సంబంధమైన అపరాధములను గురించి


ఏ వర్గమువారి మతమునైనను అవమాన పరచవలెనను ఉద్దేశముతో ఆరాధనా స్థలమును పాడు చేయుట లేక అపవిత్రము చేయుట

295. ఏ వర్గమువారి మతమునై నను అవమానపరచనలెనను ఉద్దేశముతో గాని, ఏ వర్గమువారైనను తమ మతమును అవమాన పరచినట్లు భావించగలరని తెలిసియుగాని, ఏదేని ఆరాధనా స్థలమును, లేదా ఏ వర్గము వారైనను పవిత్రమైనదిగా భావించు ఏదేని వస్తువును నాశముచేయు, పాడు చేయు, లేక అపవిత్రముచేయు వారెవరై నను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసము తో గాని, జుర్మానాతో గాని ఈ రెండింటితో గాని శిక్టింపబడుదురు.

ఏ వర్గమువారి మతమునైనను, మత విశ్వాసముల నైనను అవమానపరచుట ద్వారా మత విషయకముగా వారి మనస్సుకు బాధ కలిగించు ఉద్దే శముతో బుద్ది పూర్వకమైన, విద్వేష పూర్వకమైన కార్యములు చేయుట


295-ఏ. మత విషయకముగా భారతీయ పౌరులలో ఏదేని వర్గము వారి మనస్సుకు బాధ కలగించవలెనని బుద్ధిపూర్వకముగా, విద్వేషపూర్వకమైన ఉద్దేశముతో ఆ వర్గమువారి మతమునైనను, మత విశ్వాసములనైనను, పలికినట్టి, లేక వ్రాసినట్టి మాటల ద్వారాగాని, సంజ్ఞ లద్వారా గాని, దృశ్యరూపణముల ద్వారా గాని, అన్యధాగాని అవమానపరచు, లేక అవమాన పరచుటకు ప్రయత్నించు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.