పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసన సమ్మతముగా పంపబడి యుండిన చో మూడు సంవత్సరములదాక ఉండగల కాలావదికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పబ్లికు 'సేవకుడు తన నిర్లక్ష్యమువల్ల,పరిశొధమునుండి గాని, అభిరక్షనుండి గాని, తప్పించుకొని పోనిచ్చుట.

223. ఏదేని అపరాధ విషయమున ఆరోపణకు గురియైన, లేక దోష, స్థాపితుడైన, లేక ఆభిరక్షలో ఉంచబడుటకై శాసన సమ్మతముగా పంపబడిన ఏ వ్యక్తి నైనను, పరిశొధమునందే ఉంచుటకు పబ్లికు 'సేవకుడుగా . శాసన రీత్యా బద్దుడై యున్న పబ్లికు సేవకుడై యుండి అట్టి వ్యక్తిని నిర్లక్ష్యముతొ పరిశొధము నుండి తప్పించుకొని పోనిచ్చువారెవరైనను, రెండు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జుర్మానాతొ గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఒక వ్యక్తి శాసనానుసారముగా పట్టుబడవలసియుండి పట్టుబడకుండుటకై ప్రతిఘటించుట లేక ఆటంకపరచుట,

224. తనపై ఆరోపింపబడిన లేక తాను దోష స్టాపితుడైన ఏదేని అపరాధమునకై శాసనానుసారముగాతాను పట్టు బడవలసియుండి పట్టు కొనబడకుండుటకై ఉద్దేశపూర్వకముగా ప్రతిఘటనముగాని, శాసనవిరుద్ధమైన ఆటంకమునుగాని కలిగించు లేక ఏదేని అట్టి ఆపరాధమునకై శాసనసమ్మతముగా తాను నిరోధములో ఉంచబడినట్టి ఏదేని అభిరక్ష నుండి తప్పించుకొనిపోవు లేక తప్పించుకొని పోపుటకు ప్రయత్నించు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు,

విశదీకరణము : - పట్టు కొనబడవలసిన వ్యక్తి లేక అభిరక్షలో ఉంచబడవలసిన వ్యక్తి తన పై ఆరోపింపబడిన లేక తాను దోష స్ఠాపితుడైన అపరాధమునకు లోనై యుండు శిక్షకు ఈ పరిచ్ఛేదములోని, శిక్ష అదనముగా ఉండును.

శాసవానుసారముగా పట్టుబడ వలసియున్న ఇతర వ్యక్తి పట్టు బడకుండుటకై ప్రతిఘటించుట లేక ఆటంకపరుచుట.

225. ఎవరైనను ఒక అపరాధమునకై శాసనానుసారముగా పట్టు బడవలసియున్న ఏ ఇతర వ్యక్తి యైనను పట్టుబడకుండుటకై ఉద్దేశపూర్వకముగా ప్రతిఘటనముగాని, శాసన విరుద్ధమైన ఆటంకమునుగాని కలి గించుచో, లేక ఏ ఇతర వ్యక్తి నైనను ఆ వ్యక్తి ఏదేని అట్టి అపరాధమునకై శాసన సమ్మతముగా నిరోధములో ఉంచబడినట్టి ఏదేని అభిరక్ష నుండి ఉద్దేశపూర్వకముగా తప్పించుచో లేక తప్పించుటకు ప్రయత్నించుచో, అతడు రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడును;

లేక, ఏ వ్యక్తిని పట్టుకొనవలెనో, లేక ఏ వ్యక్తిని తప్పించుట, లేక తప్పించుటకు ప్రయత్నించుట జరిగినదో ఆ వ్యక్తి యావజ్జీవ కారావాసముతోనై నను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతోనై నను శిక్షింపబడదగిన అపరాధము విషయమున ఆరోపణమునకు గురియై లేక పట్టుకొనబడవలసినవాడై ఉన్న చో, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును; మరియు జూర్మానాకు కూడ పాత్రుడగును;

లేక, ఏ వ్యక్తిని పట్టు కొనవలెనో, లేక ఏ వ్యక్తిని తప్పించుట, లేక తప్పించుటకు ప్రయత్నించుట జరిగినదొ ఆ వ్యక్తి మరణదండనతో శిక్షింపబడదగిన ఆసరాధము విషయమున ఆరోపణమునకు గురియై లేక పట్టు కొనబడనలసినవాడై, ఉన్నచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును, మరియు జూర్మానాకు కూడ పాత్రుడగును;

లేక, ఏ వ్యక్తిని పట్టు కొనవలెనో, లేక ఏ వ్యక్తిని తప్పించుట లేక తప్పించుటకు ప్రయత్నించుట జరిగినదో ఆ వ్యక్తి న్యాయస్థానపు దండనోత్త రువును బట్టి గాని అట్టి దండనోత్త రువును లఘాకరించినందువలనగాని, యావజ్జీవ కారావాసమునకైనను, పది సంవత్సరముల లేక అంతకు మించిన కాలావధికి కారావాసమునకై నను లోనై యున్నచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును;


లేక, ఏ వ్యక్తిని పట్టుకొనవలెనో, లేక ఏ వ్యక్తిని తప్పించుట లేక తప్పించుటకు ప్రయత్నించుట జరిగినదో ఆ వ్యక్తి మరణ దండనోత్త రుపుకు గురియై ఉన్న చో యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును

అన్యధా నిబంధనలు చేయబడని సందర్భము లలో పబ్లికు సేవకుడు ఎవరినైనా పట్టుకోనకుండుట లేక తప్పించు కొని పోనిచ్చుట.

225-5. 221వ పరిచ్ఛేదము, 222వ పరిచ్ఛేదము, 'లేక 223న పరిచ్ఛేదములో గాని, తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో గాని నిబంధనలు చేయబడని ఏ సందర్భములో నైనను ఏ వ్యక్తి నై నను పట్టు కొనుటకు, లేక పరిశొధమునందే ఉంచి ఉంచుటకు పబ్లికు సేవకుడుగా శాసవరీత్యా బద్దుడై యున్న పబ్లికు సేవకుడై యుండి ఆ వ్యక్తిని పట్టు కొనకుండు, లేక పరిశొధమునుండి అతనిని తప్పించుకొని పోనిచ్చు వారెవరై నను-