పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50

యావజ్జీవ కారావాసముతో లేక కారావాసముతో శిక్షింపదగినదైనచో

అపరాధము యావజ్జీవ కారావాసముతొగాని, పది సంవత్సరముల వరకు కారావాసముతో గాని శిక్షింపదగినదైనచో జుర్మానాతోగాని జూర్మానా లేకుండగాని, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాస ముతో శిక్షింపబడుదురు;

మరియు, అపరాధము పది సంవత్సరముల వరకు కాక, ఒక సంవత్సరము దాక ఉండగల కారావాసముతో శిక్షింప దగినదైనచో, ఆ ఆపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘతమ కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి, అట్టి ఆపరాధమునకు నిబంధనానుసారము ఏ రకపు కారావాసము గలదో, ఆ రకపు కారావాసముతో గాని జర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఈ పరిచ్ఛేదములో “అపరాధము" అను పదపరిధియందు, ఏ కార్యమును చేయుట లేక చేయకుండుట విషయ మున ఒక వ్యక్తి భారత దేశములో దోషియై యుండినచో ఒక ఆపరాధముగా అది శిక్షింవబడదగియుండి, ప్రత్యర్పణము నకు సంబంధించిన ఏదేని శాసనము క్రిందగాని, అన్యథాగాని భారతదేశములో అతనిని పట్టుకొని అభిరక్ష యందుంచ వలసియుండెడిదో, అది భారతదేశము వెలుపల అతడు చేసి, లేక చేయకుండి, దోషియైనాడని చెప్పబడినట్టి దేనినైనను చేయుట, లేక చేయకుండుట కూడ చేరియుండును, మరియు ఈ పరిచ్ఛేదము నిమిత్తము అట్టి ప్రతి కార్యము చేయుట, లేక చేయకుండుట నిందిత వ్యక్తి భారతదేశములో దోషియై యుండిన ఎలొ అట్లే శిక్షింపదగియుండునని భావించవలెను.

మినహాయింపు :--- పట్టుకొనబడవలసిన వ్యక్తి కి భర్త, లేక భార్య ఆశ్రయమిచ్చినట్టి లేక పట్టుకొనబడవలసిన వ్యక్తిని భర్త, లేక భార్య దాచినట్టి ఏ సందర్భమునకై నను ఈ నిబంధన విస్తరించదు.


దోపిడీ దొంగలకు లేక బందిపోటు దొంగలకు ఆశ్రయమిచ్చినందుకు శాస్త్రి.

216-ఏ. దోపిడీని లేక బందిపోటును ఎవరేని వ్యక్తులు చేయుచున్నారని గాని ఇటీవలనే చేసినారనిగాని తెలిసి యుండియు, లేక అట్లని విశ్వసించుటకు కారణముండియు, అట్టి దోపిడీ లేక బందిపోటు చేయుటకు వీలుకలిగించు లేక వారికి గాని, వారిలో ఎవరికై నను గాని శిక్ష పడకుండా కాపాడు ఉద్దేశముతో వారికి గాని, వారిలో ఎవరికైననుగాని ఆశ్రయమిచ్చు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము:--- దోపిడీ లేక బందిపోటు చేయుటకు ఉద్దేశింపబడినది లేక చేయబడినది. భారత దేశము, లోపలనా లేక వెలుపలనా అనునది ఈ పరిచ్ఛేదము నిమిత్తము ముఖ్యము కాదు.

మినహాయింపు :-- అపరాధికి భర్త లేక భార్య ఆశ్రయమిచ్చినట్టి ఏ సందర్భమున కైనను ఈ నిబంధన విస్తరించదు.

216. బీ......

వ్యక్తికి శిక్ష పడుతుండ,ఆస్తి సమపహరణము కాకుండ, కాపాడు ఉద్దేశముతో పబ్లికు


217. పబ్లికు సేవకుడై యుండి, అట్టి పబ్లికు సేవకుడుగా తాను వ్యవహరించ వలసిన తీరును గూర్చిన ఏదేని శాసనాదేశమును పాటించకుండుట ద్వారా, శాసనవిహిత శిక్ష పడకుండ ఏ వ్యక్తి నైనను కాపాడవలెనను ఉద్దేశముతో, లేక తద్వారా తాను అతనిని అట్లు కాపాడగలననిగాని, అతడు పాత్రుడై యుండునట్టి శిక్ష కంటే తక్కువ


 శిక్షకు అతనిని లోను చేయవచ్చుననిగాని ఎరిగియుండి, లేదా శాసనానుసారముగా సముపహరణమునకుగాని,

ఏదేని సే ఆ సమపహరణమునకు లేక ఆ ప్రభారమునకు గురికాకుండ కాపాడ. మును పాటించకుండుట. వలెనను ఉద్దేశముతో, లేక కాపాడగలనని ఎరిగియుండి బుద్ధి పూర్వకముగా ఆ శాసనాదేశమును పాటించనివారెవరైనను, రెండు సంవత్సరముల దాకి ఉండగల కాలానధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, రెండింటిలోగాని శిక్షింపబడుదురు. $ ఈ వ్యక్తికి శిక్ష పడకుండ 218. పబ్లికు సేవకుడై యుండి, అట్టి పబ్లికు సేవకుడుగా ఏదేని రికార్డును లేక ఇతర వ్రాతను తయారు లేక ఆస్తి సమపహరణము చేయు బాధ్యత కలిగియుండి, ఆ రికార్డును లేక వ్రాతను సరిగా రూపొందించ కుండుట ద్వారా ప్రజల కై నను, ఎవరేని, కాకుండ కాపాడు వ్యక్తి కై నను నష్టము, లేకి హాని కలిగించవలెనను ఉద్దేశముతో, లేక తద్ద్వారా తాను అట్లు కలిగించగలనని ఎరిగియుండి, ఉద్దేశముతో సరిగా తేవి రికార్డును, లేక లేదా తద్ద్వారా ఏ వ్యక్తి కైనను శావన నిహిత శికై పడకుండ కాపాడవలెనను ఉద్దేశముతో, లేక తద్వారా తాను అట్లు కాపాడగలనని ఎరిగియుండి, లేదా శాసనము ద్వారా సముపహరణమునకు లేక ఇతర ప్రభారమునకు గురికావలసియున్న కుడు రూపొందించుట, ఏదేవి ఆస్తిని ఆ సమపహరణమునకు లేక ప్రభారమునకు గురికాకుండ కాపాడవలెనను ఉద్దేశముతో లేక తద్దార్వా తాము అట్లు కాపాడగలనని ఎరిగియుండి, ఆ రికార్డు లేక వ్రాత సరిగా లేనిదని తెలిసియు అట్టి రీతిలో రూపొందించు. వారెవరై నమ, మూడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారాహసముతోగానీ, జూర్మావాతో గాని, ఈ రెండింటిలోగాని శంపబడుదురు. వ్రాతన పట్టికు 'సేవ