పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44


తప్పుడు సాక్ష్యమును కల్పించుట.

192. ఒక న్యాయిక చర్యలో గాని, పబ్లికు సేవకుడుగా వ్యవహరించుచున్నప్పుడు ఒక పబ్లికు సేవకుని సమక్షమున నైనను, ఒక మధ్యవర్తి సమక్షముననైనను శాసనరీత్యా జరుగు చర్యలోగాని, ఏదేని పరిస్థితి, తప్పుడు నమోదు లేక తప్పుడు కథనము సాక్ష్యమునందు కాన్పించవలెననియు అట్లు సాక్ష్యమునందు కాన్పించు ఆ పరిస్థితి, తప్పుడు నమోదు, లేక తప్పుడు కథనము అట్టి చర్యలో ఆ సాక్ష్యము పై అభిప్రాయము ఏర్పరచుకొనవలసిన ఏ వ్యక్తి నైనను ఆ చర్య ఫలితమును గూర్చిన ఒక ముఖ్యాంశము పై తప్పు అభిప్రాయము ఏర్పరచుకొనునట్లు చేయవలెననియు ఉద్దేశించి అట్టి పరిస్థితిని కలిగించు, లేక ఏదేవి పుస్తకములోనై నను, రికార్డులోనైనను అట్టి తప్పుడు నమోదు చేయు లేక అట్టి తప్పుడు కథనము గల ఏదేని దస్తావేజును రూపొందించు నతడెవరైనను తప్పుడు సాక్ష్యమును కల్పించినట్లు చెప్పబడును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' కు చెందిన పెట్టెలో ఆభరణములు దొరికి, ఆ పరిస్థితివలన 'జడ్' దొంగతనమునకు దోష స్థాపితుడు కావలెనను ఉద్దేశ్యముతో ఆతని పెట్టెలో 'ఏ' ఆభరణములను ఉంచును. “ఏ' తప్పుడు సాక్ష్యమును కల్పించినవాడగును.

(బి) న్యాయస్థానములో బలపరచు సాక్ష్యముగ ఉపయోగించు నిమిత్తము 'ఏ' తన అంగడి- పుస్తకములో తప్పుడు నమోదు చేయును. 'ఏ' తప్పుడు సాక్ష్యమును కల్పించినవాడగును.

(సీ) 'జడ్' అపరాధిక కుట్రకు దోషస్థాపితుడు కావలెనను ఉద్దేశ్యముతో, అట్టి ఆపరాధిక కుట్రలోని పహాపరాధికి వ్రాసినట్లు తాత్పర్యమిచ్చు ఒక జాబును 'జడ్' దస్తూరిని అనుకరించుచు 'ఏ' వ్రాసి, ఆ జాబును పోలీసు అధికారులు సోదా చేయగలరని తనకు తెలిసియున్నట్టి స్థలములో ఉంచును. 'ఏ' తప్పుడు సాక్ష్యమును కల్పించిన వాడగును.

తప్పుడు సాక్ష్యమువకు శిక్ష.

193. న్యాయికచర్య యొక్క ఏ దశలోనైనను ఉద్దేశపూర్వకముగా తప్పుడు సాక్ష్యమునిచ్చు లేక న్యాయిక చర్యయొక్క ఏ దశలో నైనను ఉపయోగింపబడు ఏమిత్తము తప్పుడు సాక్ష్యము కల్పించువారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు;

మరియు ఏ ఇతర కేసులోనైనను ఉద్దేశపూర్వకముగా తప్పుడు సాక్ష్యము నిచ్చు లేక తప్పుడు సాక్ష్యము కల్పించు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము 1:-సైనిక న్యాయస్థాన సమక్షమున జరుగు విచారణ వ్యాయికచర్య ఆగును.

విశదీకరణము 2 :- న్యాయస్థాన సమక్షమున జరిగెడు చర్యకు పూర్వరంగముగా శాసనరీత్యా ఆదేశింపబడు దర్యాప్తు, ఆ దర్యాప్తు న్యాయస్థాన సమక్షమున జరుగకపోయినప్పటికీ వ్యాయికచర్యయందు ఒక దశయై యుండును.

ఉదాహరణము

‘జడ్' ను విచారణకై పంపవలెనా అనుదానిని విశ్చయించు నిమిత్తము మేజిస్టేటు సమక్షమున జరుగు పరిశీలనలో ఏ' ప్రమాణము చేసి అబద్ధపుదని తనకు తెలిసినదానిని నిజమని చెప్పును. ఈ పరిశీలన న్యాయికచర్యయందు ఒక దశయై నందున 'ఏ' తప్పుడు సాక్ష్యము ఇచ్చినవాడగును.

విశదీకరణము 3 :- న్యాయస్థానముచే శాసనానుసారము ఆదేశింపబడి న్యాయస్థాన ప్రాధికారము క్రింద జరుపబడు దర్యాప్తు, ఆ దర్యాప్తు న్యాయస్థాన సమక్షమున జరుపబడనప్పటికినీ, న్యాయికచర్యయందు ఒక దశయై ఉండును.

ఉదాహరణము

భూమి సరిహద్దులను అచ్చటనే నిశ్చయించుటకై న్యాయస్థానము పంపిన అధికారి సమక్షమున జరుగు పరిశీలనములో 'ఏ' ప్రమాణము చేసి ఆబద్ధపుదని తనకు తెలిసియున్నట్టి దానిని నిజమని చెప్పును. ఈ పరిశీలనము న్యాయికచర్యయందు ఒక దశయైనందున, 'ఏ' తప్పుడు సాక్ష్యము నిచ్చినవాడగును.