పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43


పబ్లికు సేవకునికి హాని కలిగింతునని బెదిరింపు.

189. ఏ పబ్లికు సేవకునినైనను ఆ పబ్లికు సేవకుని యొక్క పబ్లికు కృత్యముల నిర్వర్త నమునకు సంబంధించిన ఏదేని కార్యమును అతడు చేయుటకుగాని, చేయకుండుటకుగాని, చేయుటయందు జాప్యము చేయుటకుగాని ప్రేరేపించు నిమిత్తమై అట్టి పబ్లికు సేవకునికైనను, ఆ పబ్లికు సేవకుడు ఏ వ్యక్తి పట్ల హితాభిలాషియైయున్నాడని తాను విశ్వసించుచున్నాడో అట్టి ఎవరేని వ్యక్తి కైనను హాని కలిగింతునని బెదిరించువారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఒక వ్యక్తి రక్షణ కొరకై పబ్లికు సేవకునికి దరఖాస్తు పెట్టుకొనకుండ ప్రేరేపించుటకై అతనికి హానికలిగింతునని బెదిరించుట,

190. ఏదేని హాని నుండి రక్షణ నిచ్చుటకు గాని అట్టి రక్షణ నిప్పించుటకుగాని శాసనరీత్యా అధికారము గల ఏ పబ్లికు సేవకునికైనను శాసనపరమైన దరఖాస్తును చేయకుండుటకు లేక దరఖాస్తును చేయుట మానుకొనుటకు ఏ వ్యక్తి నైనను ప్రేరేపించు నిమిత్తము ఆ వ్యక్తి కి హాని కలిగింతునని బెదిరించువారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానా తోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

అధ్యాయము 11

తప్పుడు సాక్ష్యము మరియు న్యాయపాలనకు భంగకరమగు అపరాధములను గురించి

తప్పుడు సాక్షము ఇచ్చుట.

191. ప్రమాణము చేసినందునగాని, అభివ్యక్త శాసన నిబంధననుబట్టి గాని నిజమును చెప్పవలసియుండి లేక శాసన రీత్యా ఏదేని విషయము పై ప్రఖ్యానము చేయవలసి యుండి, ఆబద్ధమైనట్టిదగు, మరియు అబద్ధమై నట్టిదని తనకు తెలిసి యున్నట్టిదైనను, అట్టిదని తాను విశ్వసించుచున్నట్టిదైనను, లేక నిజమైనదని తాను విశ్వసించనట్టిదైనను అగు దేనినైనను చెప్పినవారెవరైనను తప్పుడు సాక్ష్యము ఇచ్చినట్లు చెప్పబడుదురు.

విశదీకరణము 1 :-నోటి మాటలద్వారా చెప్పినదైనను, ఇతర విధముగా తెలిపినదైనను, ఈ పరిచ్చేదపు భావములో “చెప్పిన" దగును.

విశదీకరణము : 2-దేనినై నను చెప్పు వ్యక్తి తాను విశ్వసించుదానిని గూర్చి చెప్పిన అబద్ధము ఈ పరిచ్చేద భావములోనికి వచ్చును, మరియు ఒక వ్యక్తి తాను విశ్వసించనట్టి విషయమును గురించి విశ్వసించుచున్నానని చెప్పినను తనకు తెలియనట్టి విషయమును గురించి తెలియునని చెప్పినను కూడ తప్పుడు సాక్ష్యము ఇచ్చినట్లు కావచ్చును.

ఉదాహరణములు

(ఏ) వేయి రూపాయలకొరకు 'జడ్' పై 'బి'కి గల న్యాయమైన క్లెయిమును సమర్ధించుచు 'బీ' యొక్క క్లెయిము న్యాయమైనట్లు 'జడ్' ఒప్పుకొనగా తాను వినినట్లు విచారణయందు ప్రమాణము చేసి 'ఏ' అబద్ధము చెప్పును. 'ఏ' తప్పుడు సాక్ష్యము ఇచ్చినవాడగును.

(బి) ప్రమాణము చేసి నిజమును చెప్పుటకు 'ఏ' బద్దుడై యుండి ఒకానొక సంతకము 'జడ్' యొక్క దస్తూరిలో ఉన్నదని తాను విశ్వసింపకున్నను అది 'జడ్' యొక్క దస్తూరిలో ఉన్నదని తాను విశ్వసించుచున్నానని చెప్పును. ఇచట ఆతడు చెప్పినది అతనికి అబద్ధమని తెలియును; కావున తప్పుడు సాక్ష్యము ఇచ్చినవాడగును,

(సీ) 'జడ్' దస్తూరి సాధారణముగా ఎటులనుండునో ఎరిగియుండిన 'ఏ' ఒకానొక సంతకము 'జడ్' యొక్క దస్తూరిలో ఉన్నదని తాను విశ్వసించుచున్నానని చెప్పును, ఆది “జడ్" దస్తూరియేనని 'ఏ' సద్భావముతో విశ్వసించుచుండెను. ఇచట 'ఏ' చెప్పినది కేవలము అతని విశ్వాసమునకు సంబంధించినదియును, అతని విశ్వాసమును బట్టి నిజమై నదియును. కావున, సంతకము “జడ్" దస్తూరిలో లేకపోయినను, “ఏ" తప్పుడు సాక్ష్యము ఈయలేదు.

(డి) ప్రమాణము చేసి నిజమును చెప్పుటకు “ఏ' బద్దుడై యుండి 'జడ్' ఫలాని దినమున ఫలానా స్థలములో ఉన్నట్లు తనకు తెలియునని ఆ విషయమును గూర్చి అతనికి ఏమియు తెలియకున్నను చెప్పును. పేర్కొనబడిన ఆ దినమున 'జడ్' ఆ స్థలములో ఉన్నను లేకున్నను 'ఏ' తప్పుడు సాక్ష్యము ఇచ్చిన వాడగును.

(ఈ) ప్రమాణము చేసి ఒక కథనమును లేక దస్తావేజును సరిగా అర్థ వివరణ చేయుటకు లేక అనువాదము, చేయుటకు బద్ధుడై యున్నట్టి దుబాసీ లేక అనువాదకుడైన 'ఏ' ఆ కథనము, లేక దస్తావేజు యొక్క సరియైన అర్ధ వివరణ లేక అనువాదము కానట్టి మరియు సరియైనదని తాను విశ్వసించనట్టి దానిని సరియైన అర్థ వివరణ లేక, అనువాదముగా ఇచ్చును లేక ధ్రువపరచుము. 'ఏ' తప్పుడు సాక్ష్యము నిచ్చినవాడగును.