పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{{|c|}}


1898 లోని 5వది.

లేక, ఈయవలసిన నోటీసుగాని, అందచేయవలసిన సమాచారముగాని, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1898 యొక్క 565వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (1) క్రింద చేయబడిన ఉత్త రువును బట్టి ఈయవలసినదైనచో, లేక అందజేయ వలసినదైనచో, ఆరుమాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయల దాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

తప్పుడు సమాచారమును అందజేయుట,

177. ఏ పబ్లికు సేవకుని కైనను అట్టి పబ్లికు సేవకునిగా అతనికి ఏదేని విషయమును గురించి సమాచారమును ఆందజేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి, ఆ విషయమును గురించి తప్పుడుదని తాము ఎరిగియున్నట్టి లేక తప్పుడుదని తాను విశ్వసించుటకు కారణము కలిగియున్నట్టి సమాచారమును నిజమైన సమాచారముగా అందజేయు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసములోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు;

లేక, శాసన రీత్యా అతడు ఇచ్చుటకు బద్దుడై యున్నట్టి సమాచారము అపరాధము జరుగుటకు సంబంధించినదైనను, ఆపరాధమును నివారించుటకు లేక అపరాధిని పట్టుకొనుటకు కావలసినదై నను ఆగుచో, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతో గాని, లేక ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అను భూస్వామి తన ఎస్టేటు హద్దులలో హత్య జరిగినదని ఎరిగియుండియు, పాముకాట, పరిణామముగా దుర్ఘటనల్ల మరణము సంభవించినదని జిల్లా మేజిస్టేటుకు బుద్ధి పూర్వకముగా తప్పుడు సమాచారము నిచ్చును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(బి) గ్రామ పహరాదారగు 'ఏ' ప్రక్క ప్రాంతములో నివసించుచున్న ధనికుడగు 'జడ్' అను సాహుకారు ఇంటిలో బందిపోటు చేయుటకై ఆగంతుకుల గుంపు ఒకటి తన గ్రామము గుండా వెళ్లినదని ఎరిగియుండి, అతి సమీపమునందు గల పోలీసు స్టేషను అధికారికి, బెంగాలు కోడు, 1821 3వ వినియమపు 7వ పరిచ్ఛేదము యొక్క ఖండము 5 క్రింద, పై సంగతిని గురించిన సమాచారమును శీఘ్రముగామ, సకాలములోను అందజేయ వలసిన వాడై యుండి, గ్రామముగుండా వేరే దిశలో సుదూరమందున్న ఒకానోక స్థలములో బందిపోటు చేయుటకై అనుమానాస్పదులైన దుండగులతో కూడిన ఒక గుంపు వెళ్లినదని ఆ పోలీసు అధికారికి బుద్ధి పూర్వకముగా తప్పుడు సమాచారమిచ్చును. ఇచట 'ఏ' ఈ పరిచ్ఛేదపు చివర భాగములో నిర్వచింపబడిన ఆపరాధము చేసిన వాడగును.

విశదీకరణము:—— 176న పరిచ్ఛేదములోను, ఈ పరిచ్చేదములోను 'అపరాధము' అను, పదపరిధి యందు ఏ కార్యము భారత దేశములో చేయబడియుండినచో, ఈ క్రింది పరిచ్ఛేదములలో, అనగా 302, 304, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 402, 435, 436, 449, 450, 457, 458, 459, మరియు 460 లలో దేవి క్రిందనై నను శిక్షింపబడదగియుండునో, అట్టి ఏ కార్యమైనను భారత దేశము వెలుపల ఏ స్థలమునందుచేయబడినదైనను చేరియుండును, మరియు 'అపరాధి' అను పదపరిధియందు అట్టి ఏదేని కార్యము చేసెననెడి ఆరోపణకు గురియైన ఏ వ్యక్తి యైనను చేరియుండును.

ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేయవలసినదని పబ్లికు సేవకుడు తగు రీతిగా కోరినప్పుడు నిరాకరించులు,

178. నిజము చెప్పుదునని ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేయవలసినదిగా కోరుటకు శాసనరీత్యా సమర్దుడై నట్టి పబ్లికు సేవకుడు అట్లు చేయుమని కోరినపుడు, అట్లు చేయుటకు నిరాకరించు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండుగల జూర్మానాతోగాని, లేక ఈ రెండింటిలో గాని శిక్షింపబడుదురు.

ప్రశ్పించుటకు ప్రాధికారముగల పబ్లికు సేవకునికి జవాబు నిచ్చుటకు నిరాకరించుట,

179. ఎవరేని పబ్లికు సేవకునికి ఏదేని విషయమును గురించి నిజము చెప్పుటకు శాసనరీత్యా బద్దుడైయుండి ఆ పబ్లికు సేవకుడు తనకు శాసనరీత్యాగల అధికారములను వినియోగించుటలో ఆ విషయమును గురించి అడిగిన ఏదేని ప్రశ్నకు జవాబు నిచ్చుటకు నిరాకరించు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.