పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

పబ్లికు సేవకుని ఉత్తరువును పాటించి హాజరు కావలసియుండియు, హాజరు కాకుండుట.

174. పబ్లికు సేవకుడుగా సమనును, నోటీసును, ఉత్తరువును లేక అధి ప్రఖ్యానమును జారీచేయుటకు శాసనరీత్యా సమర్థుడైనట్టి ఎవరేని పబ్లికు సేవకుని నుండి వచ్చినట్టి, సమనును, నోటీసును, ఉత్తరువును లేక అధి ప్రఖ్యానమును దేనినైనను పాటించి ఒకానొక స్థలమున మరియు ఒకనొక సమయమున స్వయము గానైనను, ఏజెంటు ద్వారానై నను హాజరగుటకు శాసనరీత్యా బద్దుడై యుండియు,

అట్టి స్థలమున, లేక సమయమున ఉద్దేశపూర్వకముగా హాజరుకానట్టి, లేక హాజరు కావలసిన స్థలమునుండి శాసన సమ్మతముగా వెళ్లి పోదగిన సమయమునకు వెళ్లి పోవునట్టి వారెవరైనను,

ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జూర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;

లేక, ఆ సమను గాని, నోటీసు గాని, ఉత్తరువు గాని, ఆది ప్రఖ్యానము గాని న్యాయస్థానము నందు స్వయముగానైనను, ఏజెంటుద్వారానైనను హాజరు కావలెననునట్టిది అయినచో, ఆరుమాసముల దాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, వేయి రూపాయల దాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండిటితో గాని, శిక్షింపబడుదురు.

{{c|ఉదాహరణములు|]]

(ఏ) కలకత్తా ఉన్నత న్యాయస్థానము నుండి జారీచేయబడిన సుపీనాను పాటించి ఆ న్యాయస్థాన సమక్షమున హాజరగుటకు ఏ అనునతడు శాసనరీత్యాబద్దుడై యుండియు, ఉద్దేశపూర్వకముగా హాజరు కాకుండును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(బి) జిల్లా న్యాయాధీశునిచే జారీచేయబడిన సమనును పాటించి ఆ జిల్లా న్యాయాధీశుని సమక్షమున సాక్షిగా హాజరగుటకు 'ఏ' అనునతడు శాసనరీత్యాబద్దుడై యుండియు, ఉద్దేశపూర్వకముగా హాజరు కాకుండును 'ఏ ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

పబ్లికు సేవకుని వద్ద దస్తావేజును దాఖలు చేయుటకు శాసనరీత్యా బద్దుడైన వ్యక్తి దానిని దాఖలు చేయకుండుట.

175. ఏదేని దస్తావేజును ఎవరేని పబ్లికు సేవకుని వద్ద దాఖలు చేయుటకు లేక అతనికి అందజేయుటకు శాసన రీత్యా బద్ధుడై యుండి, దానిని ఉద్దేశపూర్వకముగా అట్లు దాఖలు చేయనట్టి, లేక అందజేయనట్టి వారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గానీ, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;

లేక,ఆ దస్తావేజు న్యాయస్థానములో దాఖలు చేయవలసినట్టిది లేక అందజేయవలసినట్టిది అయినచో, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు,

ఉదాహరణము

జిల్లా న్యాయస్థాన సమక్షమున ఒక దస్తావేజును దాఖలు చేయుటకు శాసనరీత్యా బదుడై యుండియు, "ఏ " అనువతడు ఉద్దేశపూర్వకముగా దానిని దాఖలు చేయడు. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

పబ్లికు సేవకునకు నోటీసును ఇచ్చుటకు లేక సమాచారమును అందజేయుటకు శాసనరీత్యాబద్దుడై యున్నట్టి వ్యక్తి అట్లు చేయకుండుట.

176. ఏ పబ్లికు సేవకునికైనను ఆట్టి పబ్లికు సేవకునిగా అతనికి ఏదేని విషయమును గురించి నోటీసును ఇచ్చుటకు లేక సమా చారమును అందజేయుటకు శాసన రీత్యాబద్దుడైయుండి, శాసనము ద్వారా కోరబడిన రీతిలో మరియు అట్టి సమయమున ఉద్దేశపూర్వకముగా, అట్టి నోటీసును. ఈయనట్టి లేక అట్టి సమాచారమును అందజేయనట్టి వారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు;

లేక, ఈయవలసిన నోటీసుగాని, అందజేయవలసిన సమాచారముగాని, అపరాధము జరుగుటకు సంబంధించినదైనను, అపరాధమును నివారించుటకు లేక ఆపరాధిని పట్టుకొనుటకు కావలసినదైనను అగుచో, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;