పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37


అయితే, పబ్లికు విధానమునకు సంబంధించిన ప్రఖ్యానము చేయుట గాని, పబ్లికు చర్య తీసికొందునని వాగ్దానము చేయుటగాని ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము కాదు.

(2) పారితోషికమును ఈయజూపు లేక ఇచ్చుటకు అంగీకరించు, లేక సమకూర్చజూపు లేక సమకూర్చ ప్రయత్నించునట్టి వ్యక్తి పారితోషికము ఇచ్చినట్లు భావించవలెను.

(3) పారితోషికములు పొందునట్టి లేక స్వీకరించుటకు అంగీకరించునట్టి లేక పొందుటకు ప్రయత్నించు నట్టి వ్యక్తి పారితోషికమును స్వీకరించినట్లు భావించబడును, మరియు తాను చేయుటకు ఉద్దేశించని దానిని దేనినైనను చేయుటకు ప్రేరణముగ, లేక తాను చేయునట్టి దానిని దేనినై నను చేసినందుకు బహుమానముగ పారితోషికమును స్వీకరించునట్టి వ్యక్తి ఆ పారితోషికమును బహుమానముగ స్వీకరించినట్లు భావించవలెను.

ఎన్నికలలో అనుచితమైన ఒత్తిడి,

171-సీ. (1) ఏదేని ఎన్నిక హక్కును స్వేచ్ఛగా వినియోగింపబడినీయక స్వచ్ఛందముగా జోక్యము కలుగజేసికొను లేక కలుగజేసికొన ప్రయత్నించు వారేసరైనను, ఎన్నికలో అనుచితమైన ఒత్తిడి చేయు ఆపరాధము చేసినవారగుదురు.

(2) ఉపపరిచ్ఛేదము (1) యొక్క నిబంధనల: వ్యాపకతకు భంగము లేకుండ,

(ఎ) ఏరకపుదైన హానినైనను కలిగింతునని ఏ అభ్యర్థి నైనను, ఏ వోటరునైనను, లేక అభ్యర్థి గాని వోటరుగాని ఎవరిపట్ల హితాభిలాషియై యున్నాడో ఆ వ్యక్తి నైనను బెదరించు వారెవరైనను, లేక

(బి) అభ్యర్థియైనను, వోటరైనను, అతడు ఎవరిపట్ల హితాభిలాషియై యున్నాడో ఆ వ్యక్తి నైనను,దైవాను గ్రహమునకుగాని, ఆధ్యాత్మిక అభిశంసనకు గానీ, గురికాగలడని లేక గురికావింపబడగలడని ఆ అభ్యర్థిని గాని వోటరునుగాని విశ్వసించునట్లు చేయు లేక అట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను,

ఉపపరిచ్ఛేదము (1) యొక్క భావమునందు అట్టి అభ్యర్థి లేక వోటరు. తన ఎన్నిక హక్కును స్వేచ్చగా వినియోగించకుండా జోక్యము కలుగజేసికొన్నట్లు భావింపబడుడురు,

(3) పబ్లికు విధానమునకు సంబంధించిన ప్రఖ్యానమును చేయుటగాని, పబ్లికు చర్య తీసికొందునని వాగ్దానము చేయుటగాని, ఎన్నిక హక్కు విషయమున జోక్యము కలిగించుకొను ఉద్దేశము లేకుండ "కేవలము ఏదేని శాసనిక హక్కును వినియోగించు కొనుటను గానీ, ఈ పరిచ్చేద భావము నందు జోక్యముగా భావించరాదు.

ఎన్నికలయందు ప్రతి రూపణము.

171- డీ. బ్రతికియున్న లేక చనిపోయిన ఎవరిని ఇతర వ్యక్తి పేరుతో నైనను, కల్పితమైన పేరుతో నైనను, ఒక ఎన్నిక యందు వాటు పత్రము కొరకు దరఖాస్తు చేయు, లేక వోటు చేయు, లేదా అట్టి ఎన్నిక యందు ఒకసారి వోటు వేసియుండి అదే ఎన్నికయందు తమ పేరుతో మరల వోటు పత్రము కొరకు దరఖాస్తు చేయు వారెవరైనను మరియు ఎవరేని వ్యక్తిని వోటు వేయుటకు దుష్ప్రేరణచేయు, అతనిచే వోటు వేయించు లేక అట్టి ఏ ప్రకారముగ నైనను వోటు వేయించుటకు ప్రయత్నించు వారెవరై నను, ఎన్నికయందు ప్రతిరూపణాపరాధము చేసిన వారగుదురు.

లంచగొండితనమునకు శిక్ష.

171-ఈ. లంచగొండితనము అను అపరాధము చేయువారెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు:

ఆయితే, సత్కార రూపపు లంచగొండితనము కేవలము జర్మానాలో మాత్రమే శిక్షింపబడును.

విశదీకరణము :-- "సత్కారము" అనగా ఆహారము, పానీయము, వినోద కార్యక్రమము లేక సంభారము రూపమున పారితోషికము ఉండునట్టి లంచగొండితనము అని అర్థము,

ఎన్నికయందు అనుచితమైన ఒత్తిడి చేసినందుకు లేక ప్రతి రూపణము చేసినందుకు శిక్ష.

171-ఎఫ్. ఎన్నిక యందు అనుచితమైన ఒత్తిడి లేక ప్రతిరూపణము అను అపరాధములు చేయువారెవరైనను, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఎన్నికకు సంబంధించిన తప్పుడు ప్రకటన.


171- జీ. ఎన్నికల ఫలితము పై ప్రభావము కలుగజేయు ఉద్దేశ్యముతో ఎవరేని అబ్యర్ది యొక్క వ్యక్తి గత శీలమునకుగాని, నడవడికి గాని సంబంధించి, అబద్దమైనట్టిదగు మరియు అబద్ధ మైనదని తనకు తెలిసి యున్నటి దైనను, అట్టిదని తాను విశ్వసించునట్టిదైనను, లేక నిజమైనదని తాను విశ్వసించనట్టి దైనను అగు ఒక సంగతిని గూర్చిన ప్రకటనగా తాత్పర్యమిచ్చు ఏదేని ప్రకటన చేయు లేక ప్రచురించు వారెవరైనను జుర్మానాతో శిక్షింపబడుదురు.