పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32


వారు మూడు సంవత్సరములదాక ఉండగల కారావాసముతో గాని, జార్మానాతో గాని, ఈ రెండింటితోగాని, శిక్షించబడుదురు.

(2) ఏదేని ఆరాధనా స్థలములో, లేక మత సంబంధ ఆరాధనను గాని మత సంబంధ కర్మకాండను గాని జరుపుకొనుచున్న సమావేశములో ఉపసరిచ్చేదము (1)లో నిర్దిష్టమైన అపరాధమును చేయువారెవరైనను, అయిదు సంవత్సరములదాక ఉండగల కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

శాసన విరుద్ధ సమావేశము జరుపబడినట్టి భూమి యొక్క సొంతదారు లేక ఆక్రమణదారు.


154. ఏదేని శాసనవిరుద్ధ సమావేశము లేక దొమ్మీ జరిగినప్పుడెల్లను, ఏ భూమిపై అట్టి శాసనవిరుద్ధ సమావేశము లేక అట్టి దొమ్మీ జరుపబడినదో ఆ భూమి యొక్క సొంతదారైనను, ఆక్రమణదారైనను, ఆ భూమిలో హితము కలిగియున్న లేక క్లెయిము చేయుచున్న ఎవరేని వ్యక్తియైనను, అతడుగాని ఆతని ఏజెంటుగాని, మేనేజరుగాని అట్టి అపరాధము చేయబడుచున్నదని లేక చేయబడినదని ఎరిగియుంగి, లేక చేయబడగలదని విశ్వసించుటకు కారణము కలిగియుండి, అతని యొక్క లేక వారి యొక్క శక్తి మేరకు అతి త్వరగా, అత్యంత సమీపమునగల పోలీసు స్టేషను యొక్క ప్రధాన అధికారికి తద్విషయమును తెలియజేయనిచో, మరియు ఆ అపరాధము చేయబడబోవుచున్నదని విశ్వసించుటకు ఆతనికిగాని వారికిగాని కారణమున్న సందర్భములో, దానిని నివారించుటకు అతని యొక్క లేక వారి యొక్క శక్తి మేరకు శాసన సమ్మత పద్ధతులనన్నింటిని ఉపయోగించనిచో, మరియు ఆ ఆపరాధము జరిగిన పక్షములో ఆ శాసన విరుద్ధ సమావేశమును చెదరగొట్టుటకు లేక ఆ దొమ్మీని అణచి వేయుటకు అతని యొక్క లేక వారి యొక్క శక్తి మేరకు శాసన సమ్మత పద్దతులన్నింటిని ఉపయోగించనిచో, వేయి రూపాయలకు మించని జుర్మానాతో శిక్షింపబడును.

దొమ్మీ ఎవరిమేలు కొరకు చేయబడినదో, ఆ వ్యక్తి యొక్క బాధ్యత.

155. ఏ భూమి విషయమున దొమ్మీ జరుగునో ఆ భూమి యొక్క సొంతదారైన, ఆక్రమణదారైన, లేక అట్టి భూమిలో గాని ఆ దొమ్మీకి కారణభూతమైన ఏదైనా వివాద విషయ వస్తువులో గాని హితమును దేనినైనను క్లెయిము చేయువాడైన లేక దానినుండి ఏదేని మేలును స్వీకరించిన లేక పొంచిన వాడైన ఎనలేని వ్యక్తి యొక్క మేలు కొరకు లేక అతని తరఫున దొమ్మీ చేయబడినప్పుడెల్ల ను, అట్టి వ్యక్తి గాని, అతని ఏజెంటు గాని, మేనేజరుగాని అట్టి దొమ్మీ జరుగగలదని యైనను, ఏ శాసన విరుద్ధ సమావేశము ద్వారా అట్టి దొమ్మీ జరిగినదో ఆ శాసన విరుద్ధ సమావేశము జరుగగలదనియైనను విశ్వసించుటకు కారణము ఉండియు, అట్టి సమావేశమును, లేక దొమ్మీని జరుగకుండ నివారించుటకును, దానిని ఆణచివేసి చెదరగొట్టుటకును అతని యొక్క లేక వారి యొక్క శక్తి మేరకు శాసనసమ్మత పద్ధతులనన్నింటిని ఉపయోగించనిచో, అట్టి వ్యక్తి జూర్మానాతో శిక్షింపబడును.

గొమ్మీ ఎవరి మేలు కొరకు చేయబడినదో ఆ సొంతదారు యొక్క లేక ఆక్రమణదారు

156. ఏ భూమి విషయమున దొమ్మీ జరుగునో ఆ భూమి యొక్క సొంతదారైన, లేక అక్రమణదారైన లేక అట్టి భూమిలో గాని ఆ దోమ్మీకి కారణభూతమైన ఏదై నా వివాద విషయ వస్తువులో గాని హితమునుదేనినైనను క్లెయిము చేయు వాడైన లేక దాని నుండి ఏదేని మేలును స్వీకరించిన లేక పొందిన వాడైన ఎవరేని వ్యక్తి యొక్క మేలు కొరకు లేక అతని తరఫున దొమ్మీ చేయబడినప్పుడెల్లను,

అట్టి వ్యక్తి యొక్క ఏజెంటు గాని, మేనేజరు గాని, అట్టి దొమ్మీ జరుగగలదని యైనను, ఏ శాసన విరుద్ద సమావేశము ద్వారా అట్టి డొమ్మీ జరిగినదో ఆ శాసన విరుద్ధ సమావేశము జరుగగలదనియైనను విశ్వసించుటకు కారణము కలిగియుండియు, అట్టి సమావేశమును, లేక దొమ్మీని జరుగకుండ నివారించుటకును దానిని అణచివేసి చెదర గొట్టుటకును అతని యొక్క శక్తి మేరకు శాసన సమ్మత పద్ధతులనన్నింటిని ఉపయోగించనిచో, ఆట్టి ఏజెంటు లేక మేనేజరు జుర్మానాతో శిక్షింపబడును.

శాసనవిరుద్ద సమావేశము కొరకు కిరాయికి తేబడిన వ్యక్తులకు ఆశ్రయమిచ్చుట,

157. శాసస విరుద్ధ సమావేశములో చేరుటకు లేక దానిలో పాల్గొనుటకు కిరాయికి తేబడినారని, పనిలో కుదుర్చు కొనబడినారని, లేక నియోగింపబడినారని గాని, కిరాయికి తేబడనున్నారని, పనిలో కుదుర్చుకొనబడనున్నారని, లేక నియోగింపబడనున్నారని గాని ఎరిగి యుండియు, అట్టి వ్యక్తులకు తన ఆక్రమణములో లేక ఆధీనములోనున్న లేక తన నియంత్రణలోనున్న ఏదేని ఇంటియందు లేక ఆవరణయందు ఆశ్రయమిచ్చు, వారిని చేరనిచ్చు, లేక సమావేశపరచు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.