పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31


మతము, జాతి, జన్మస్థలము, నివాసము,భాష మొదలైన వాటి ఆధారము పై విభిన్న వర్గముల మధ్య వైరభావమును పెంపొందించుట మరియు సౌహార్థభంగకర కార్యములను జేయుట.

153.-ఏ. (1) ఎవరై నను——

(ఏ) పలికినట్టి గాని వ్రాసినట్టి గాని మాటల ద్వారా, లేక సంజ్క్షల ద్వారా లేక దృశ్యరూపణముల ద్వారా లేక అన్యధా విభిన్న మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గముల మధ్య, లేక విభిన్న కులముల మధ్య, లేక విభిన్న సమాజముల మధ్య మతము, జాతి, జన్మస్థలను, నివాసము, భాష, కులము లేక సమాజమునకు సంబంధించిన ఆధారముపై లేక ఎట్టిదైనను ఏదేని ఇతర ఆధారముపై , అసౌహార్థతను గాని వైర, ద్వేష లేక వైమనస్య భావమును గాని పెంపొందించిన లేక పెంపొందించుటకు ప్రయత్నించిన యెడల, లేక

(బీ) విభిన్న మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గముల మధ్య, లేక విభిన్న కులముల మధ్య లేక విభిన్న సమాజముల మధ్య సౌహార్దమునకు భంగకరమగునట్టిదై, ప్రజా ప్రశాంతికి భంగము కలిగించునది లేక కలిగించగలదగు కార్యమును చేసినయెడల,

(సి) ఏదేని మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గముపైన, లేక ఏదేని కులము వారి పైన, లేక ఏదేని సమాజమునకు చెందినవారిపైన, ఏదేని వ్యాయామములో, ఉద్యమములో, కవాతులో లేక అటువంటి ఇతర కార్యకలాపములో పాల్గొనువారు అపరాధిక బలమునో, హింసనో ప్రయోగించవలెనను లేక ప్రయోగించుటకై శిక్షణ పొందవలెనను ఉద్దేశముతో నైనను, అట్టి కార్యకలాపములో పాల్గొను వారు అపరాధిక బలమునో, హింసనో ప్రయోగించుట, లేక ప్రయోగించుటకై శిక్షణ పొందునట్లు చేయుట సంభవమని ఎరిగియుండి యైనను, అట్టి కార్యకలాపమును నిర్వహించిన యెడలగాని, అట్టి వారిపై ఆపరాధిక బలమునో, హింసనో ప్రయోగించవలెనను లేక ప్రయోగించుటకై శిక్షణ పొందవలెనను ఉద్దేశముతోనైనను, అట్టి కార్యకలాపములో పాల్గొనువారు ఆపరాధిక బలమునో, హింసనో ప్రయోగించుట లేక ప్రయోగించుటకై శిక్షణ పొందుట సంభవమని ఎరిగి యుండియైనను, అట్టి కార్యకలాపమునందు పాల్గొనిన యెడలగాని, మరియు అట్టి కార్యకలాపము, ఎట్టి కారణమువల్లనైనను అట్టి మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గము వారికైనను, కులము వారికి లేక సమాజము వారికైనను భయమును లేక అలజడిని లేక భద్రతారాహిత్య భావమును కలుగజేసిన లేక కలిగించగలదైన యెడల,

వారు మూడు సంవత్సరములదాక ఉండగల కారావాసముతోగాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఆరాధనా స్థలము మొదలగు చోట్ల చేసిన అపరాధము.

(2) ఏదేని ఆరాధనా స్థలములో లేక మత సంబంధ ఆరాధనను గాని మత సంబంధ కర్మకాండను గాని జరుపుకొనుచున్న సమావేశములో ఉపపరిచ్ఛేదము (1)లో, నిర్దిష్టమైన ఆపరాధమును జేయువారెవరైనను, అయిదు సంవత్సరములదాక ఉండగల కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

జాతీయ సమైక్యతకు భంగకరమగు ఆరోచణలు, వక్కాణింపులు,

153.- బీ. (1) పలికినట్టి గాని, వ్రాసినట్టి గాని మాటలద్వారా, లేక సంజ్ఞలద్వారా దృశ్యరూపణముల ద్వారా లేక అన్యధా ఎవరైనను.——

(ఏ) ఏదేని మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గమునకైనను, ఏదేని కులము, లేక సమాజమునకైనను చెందిన వారైయున్న కారణమున, ఏదేని వర్గపు వ్యక్తులు శాసనము ద్వారా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్టలను కలిగియుండలేరని గాని, భారత సార్వభౌమతను, అఖండతను సమర్థించలేరని గాని, ఏదేని ఆరోపణలు చేసిన లేక ప్రచురించిన యెడల, లేక

(బి) ఏదేని మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గమునకైనను, ఏదేని కులము లేక సమాజమునకైనను చెందిన వారైయున్న కారణమున ఏదేని వర్గపు వ్యక్తులకు, భారతదేశ పౌరులుగా వారికి గల హక్కులను లేకుండ గాని దక్కకుండగాని చేయవలెనని వక్కాణించిన, బోధించిన, సలహానిచ్చిన, ప్రచారము చేసిన లేక ప్రచురించిన యెడల, లేక

(సి) ఏదేని మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గమునకైనను, ఏదేని కులము లేక సమాజమునకైనను చెందినవారై యున్న కారణముగా ఏదేని వర్గపు వ్యక్తులకు గల బాధ్యతను గురించి దేనినైనను వక్కాణించిన, బోధించిన, వాదన చేసిన, విజ్ఞప్తి చేసిన, లేక ప్రచురించిన యెడల, మరియు అట్టి వక్కాణింపు, బోధ, వాదన లేక విజ్ఞప్తి అట్టి వారి మధ్యనైనను, అట్టి వారికిని ఇతర వ్యక్తులకును మధ్యనైనను అసౌహార్థ తను గాని వైర, ద్వేష, లేక వైమనస్య భావమును గాని కలుగజేసిన లేక, కలుగజేయగల దైన యెడల,