పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24


ఉదాహరణము

పదిమందికి మించిన సభ్యులతో కూడిన ఒక తెగవారిని వారి విరోధి తెగకు చెందిన సభ్యులు ఊరేగింపు జరుపుకొను చున్నపుడు వారిపై దాడి చేయు నిమిత్తము ఫలాని చోట, ఫలాని సమయమునందు సమావేశము కావలెనని పురికొల్పుచు 'ఏ' అనునతడు ప్రకటన పత్రమును ఒక పబ్లికు స్థలమునందు అంటించును. ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును 'ఏ' చేసినవాడగును.

మరణదండనతో లేక యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయుటకుగల పన్నుగడను కప్పిపుచ్చుట.

118. మరణదండనతో లేక యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు ఒక అపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశముతో, లేక తద్వారా తాను అట్లు వీలును కలిగించుట సంభవమని ఎరిగి యుండి,

ఏదేని కార్యమును చేయుట లేక శాససరీత్యా చేయవలసిన కార్యమును చేయకుండుటద్వారా అట్టి అపరాధమును చేయుటకు ఒక పన్నుగడ ఉన్నదను విషయమును స్వచ్ఛందముగా కప్పిపుచ్చు, లేక అట్టి పన్నుగడను గురించి దేనినై నను అది అబద్ధ మై నదని ఎరిగియుండియు తెలియజేయువారెవరైనను,

అపరాధము చేయబడినచో, అపరాధము చేయబడనిచో

ఆ అపరాధము చేయబడినచో, ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనూ, లేక అపరాధము చేయబడనిచో మూడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను శిక్షింపబడుదురు. మరియు పై రెండు సందర్భములలో దేనియందైనను జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఉదాహరణము

'బీ' అను స్థలములో బందిపోటు జరుగబోవుచున్నదని ఎరిగియుండి, దానికి ఎదుటిదిశ లోఉన్న 'సీ' అను స్థలములో బందిపోటు జరుగబోవుచున్నదని మేజిస్టేటుకు 'ఏ' తప్పుడు సమాచారము యిచ్చును. తద్వారా ఆ అపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశ్యముతో మేజిస్టేటును తప్పుదారి పట్టించుసు. పన్నుగడ ననుసరించి 'బి' వద్ద బందిపోటు జరుపబడును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగి యుండును.

అపరాధమును చేయుటకుగల పన్నుగడను ఆ అపరాధమును నివారించవలసిన కర్తవ్యముగల పబ్లికు సేవకుడు కప్పిపుచ్చుట.

119. ఒక పబ్లికు సేవకుడై యుండి అట్టి పబ్లికు సేవకుడుగా ఒక అపరాధమును నివారించుట తన కర్తవ్యమై యుండగా ఆ అపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశ్యముతో లేక తద్వారా తాను అట్లు వీలును కలిగించుట సంభవమని ఎరిగియుండి,

ఏదేని కార్యమును చేయుటద్వారా లేక శాసనరీత్యా చేయవలసిన కార్యమును చేయకుండుటద్వారా, అట్టి అపరాధమును చేయుటకు ఒక పన్నుగడ ఉన్నదను విషయమును స్వచ్చందముగా కప్పిపుచ్చు లేక అట్టి పన్నుగడను గురించి దేనినైనను "అది అబద్దమైనదని ఎరిగియుండియు తెలియజేయువారెవరైనను,

అపరాధము చేయబడినచో.

ఆ అపరాధము చేయబడినచో ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తమ కారావాస కాలావధిలో సగభాగము మేరకు ఉండగల కాలావధికి ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల ఏ రకపు కారావాసముతో గాని అట్టి నిబంధనానుసారముగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఆ అపరాధము మరణదండన మున్నగువాటితో శిక్షింపదగినదైనచో

లేక, ఆ అపరాధము మరణదండనతోగాని యావజ్జీవ కారావాసముతోగాని శిక్షింపదగినదైనచో, పది సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు.

అపరాధము చేయబడనిచో.

లేక, ఆ అపరాధము చేయబడనిచో, ఆ అపరాధమునకు నిబంధనామసారముగల దీర్ఘతమ కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల ఏ రకపు కారావాసముతో గాని, అట్టి నిబంధనానుసారముగల జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

ఒక పోలీసు అధికారి అయిన ' ఏ ' తనకు తెలియవచ్చినట్టి దోపిడీలు జరుపుటకుగల పన్నుగడల నన్నిటినీ గూర్చిన సమాచారమును అందజేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి, 'బీ' దోపిడీ జరుపుటకు పన్నుగడ పన్నుచున్నాడని ఎరిగియుండి, ఆ అపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశముతో అట్టి సమాచారమును తెలియజేయకుండును. ఇచట 'ఏ ' శాసనరీత్యా చేయవలసిన పనిని చేయకుండుటద్వారా ' బీ ' పన్నిన పన్నుగడ ఉన్నదను విషయమును కప్పిపుచ్చిన వాడై, ఈ పరిచ్ఛేదపు నిబంధనల ప్రకారము శిక్షా పాత్రుడగును.