పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరువు నష్టము కలిగించునదని ఎరిగియున్న విషయమును ముద్రించుట లేక నగిషీ చెక్కుట.

501. ఏదేని విషయము ఎవరేని వ్యక్తికి పరువు నష్టము కలిగించునదని ఎరిగియుండి లేక అట్లని విశ్వసించుటకు తగిన కారణము కలిగియుండి, అట్టి విషయమును ముద్రించు, లేక నగిషీ చెక్కువారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితో గాని శిక్షింప బడుదురు.

పరువునష్టము కలిగించు విషయమును కలిగినట్టిదై, ముద్రింప బడిన లేక నగిషీ చెక్కబడిన ఏదేని వస్తువును విక్రయించుట.

602. పరువు నష్టమును కలిగించు విషయము కలిగినట్టిదై, ముద్రింపబడిన లేక నగిషి, చెక్కబడిన వస్తువును దేనినైనను, దానియందటి విషయము ఉన్నదని ఎరిగియుండి, విక్రయించు లేక విక్రయింపజూపువా రెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, జుర్మానాలో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అద్యాయము-22

ఆపరాధిక మైన జడిపింపు, అవమానము, చికాకులను గురించి

ఆపరాధికమైన జడిపింపు

503. బెదిరింపుచే మరొక వ్యక్తిని కలవర పెట్టే ఉద్దేశముతోగాని ఏ హానిని కలిగింతునని తాను బెదిరించునో ఆ హాని కలుగకుండుటకై అట్టి వ్యక్తి చేయుటకు శాసనరీత్యా బద్దుడు కాని ఏదేని కార్యమును చేయునట్లు చేయు, లేదా చేయుటకు శాసనరీత్యా హక్కుగల ఏదేని కార్యమును చేయకుండునట్లు చేయు ఉద్దేశముతోగాని, అట్టి వ్యక్తి యొక్క శరీరమునకు, ఖ్యాతికి లేక ఆస్తి కైనను, అతడు ఎవరి హితాభిలాషియో ఆ వ్యక్తి యొక్క శరీరమునకు లేక ఖ్యాతికైనను ఏదేని హాని కలిగింతునని అతనిని బెదిరించువారెవరైనను ఆపరాధికముగ జడిపించిన వారగుదురు.

విశదీకరణము : - ఎవరేని మృత వ్యక్తి యొక్క ఖ్యాతికి హాని కలుగజేయుదునను బెదిరింపు, బెదిరింపబడిన వ్యక్తి మృత వ్యక్తి యొక్క హితాభిలాషియై యున్న యెడల ఈ పరిచ్ఛేదము క్రిందికి వచ్చును.

ఉదాహరణము

'బి' నడుపుచున్న సివిలు దావాను అతడు విరమించుకొనునట్లు చేయుటకై 'బీ' యొక్క ఇంటిని తగుల బెట్టుదునని 'ఏ' అనునతడు బెదిరించును. 'ఏ' ఆపరాధికముగ జడిపించిన వాడగును.

శాంతిభంగమును కలిగించవలెనని ఉద్దేశపూర్వకముగా అవమానించుట.

504. ప్రకోపనమువలన ఎవరేని వ్యక్తి ప్రజా శాంతికి భంగము కలిగించవలెనని లేక ఏదేని ఇతర అపరాధమును చేయవలెనని ఉద్దేశించిగాని, అట్లు జరుగగలదని ఎరిగియుండిగాని, అతనిని ఉద్దేశపూర్వకముగ అవమానించి తద్వారా ప్రకోపింపజేయువారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రజలను బాధించు దుశ్చేష్ట కు దారితీయు ప్రకటనలు,

505. (1) (ఏ) భారతదేశపు సేనలోని, నౌకాబలములోని లేదా వైమానిక బలములోని ఎవరేని అధికారిగాని సైనికుడుగాని, నావికుడుగాని, వైమానికుడు గాని తిరుగుబాటు చేయునట్లయినను, తన ఉద్యోగ కర్తవ్యమును .అన్యధా నిర్లక్ష్యము చేయునట్ల యినను అట్టి కర్తవ్యమును నిర్వర్తించకుండునట్లయినను చేయవలెనను ఉద్దేశముతో లేదా అట్లు చేయగలుగునట్టి; లేక

(బి) రాజ్య వ్యతిరేకమైన లేక ప్రజా ప్రశాంతికి భంగకరమైన అపరాధము చేయుటకు ఏ వ్యక్తి నైనను ప్రేరేపించునట్లుగా ప్రజలకు, లేక ప్రజలలో ఏదేని వర్గమునకు భయమును లేక కలవరమును కలిగించవలెనను.ఉద్దేశము తో లేదా అట్లు కలిగించగలుగునట్టి; లేక

(సీ) ఏదేని వర్గము లేక సమాజమునకు చెందిన వ్యక్తులను ఏదేని ఇతర వర్గము లేక సమాజమునకు చెందినవారి పై ఏదేని అపరాధము చేయుటకు పురికొల్పవలెనను ఉద్దేశముతో, లేదా అట్లు పురికొల్పగలుగునట్టి, ఏదేని ప్రకటనను. వదంతిని, వార్తను చేసిన, ప్రచురించిన లేక ప్రచారములో పెట్టినవారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతోగాని, జర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

వర్గములమధ్య వెర భావమును, ద్వేష భావమును వైమనస్య లేక పెంపొందించు ప్రకటనలు

(2) మతము, జాతి, జన్మస్థానము, నివాసస్థానము భాష, కులము లేక సమాజము ఆధారముగ లేక ఎట్టిదైనను ఏదేని ఇతర ఆధారము పై విభిన్న మత, జాతి, భాష లేక ప్రాంతీయ సముదాయముల మధ్య, కులముల లేదా సమాజముల మధ్య వైర, ద్వేష లేక వైమనస్య భావములను సృష్టించు లేక పెంపొందించు ఉద్దేశముతో, లేదా అట్టి భావములను సృష్టింపగలుగు లేదా పెంపొందింపగలుగునట్టి వదంతితోగాని, కలవర పెట్టు సమాచారముతోగాని కూడియున్న ప్రకటనను లేక వార్తను చేసిన, ప్రచురించిన లేక ప్రచారములో పెట్టినవారెవరై నను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.