పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాత్రివేళ, ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్చన్నముగ చేయుటలో గాని, ఇంటికి కన్నము వేయుటలో గాని సంయుక్తముగా ప్రమేయముగల వ్యక్తులలో ఒకరు మరణము లేక దారుణమైన ఘాత కలుగజేసినయెడల, వారందరు శిక్షింపదగి యుందురు.

460. రాత్రివేళ ఇంట --- అక్రమ ప్రవేశము ప్రచ్చన్నముగ జేయు లేక రాత్రివేళ ఇంటికి కన్నము వేయు సమయమున, అట్టి అపరాధము చేసిన ఏ వ్యక్తి యై నను స్వచ్ఛందముగ ఎవరేని వ్యక్తికి మరణము నైనను, దారుణ ఘాతనైనను కలిగించినచో లేక కలిగించుటకు ప్రయత్నించినచో, అట్లు రాత్రివేళ ఇంట—అక్రమ ప్రవేశము ప్రచ్చన్న ముగ చేయుటలో లేక రాత్రివేళ ఇంటికి కన్నము వేయుటలో సంయుక్త ముగా ప్రమేయముగల ప్రతి వ్యక్తియు యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

లోన ఆస్తి ఉన్న పేటికను నిజాయితీ లేకుండా పగులగొట్టి తెరచుట,

461. లోన ఆస్తి ఉన్నట్టిదై లేక ఉన్నదని తాను విశ్వసించుచున్నట్టిదై మూయబడి యున్న ఏదేని పేటికను నిజాయితీ లేకుండగాని దుశ్చేష్ట చేయు ఉద్దేశముతో గాని, పగులగొట్టి తెరచు, లేక మూసియుంచు, బంధనము విప్పు నతడెవరై నను రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతో గాని ఈ రెండింటితో గాని, శిక్షింప బడును.

అభిరక్ష ఆప్పగింపబడిన వ్యక్తి అదే అపరాధమును చేసినప్పుడు శిక్ష,

462. లోన ఆస్తి ఉన్నట్టిదై లేక ఉన్నదని తాను విశ్వసించు నట్టిదై మూయ బడియున్న ఏదేని పేటికను, అప్పగింప బడియుండి, దానిని తెరచుటకు ప్రాధికారము లేకుండియు, నిజాయితీ లేకుండగాని, దుశ్చేష్ట జేయు ఉద్దేశముతో గాని, ఆ పేటికను పగులగొట్టి తెరచు, లేక మూసియుంచు, బంధనము విప్పు నతడెవరైనను, మూడు వత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

{{c|అధ్యాయము-18

{{c|[[larger|దస్తావేజులకు, స్వామ్య చిహ్నములకు సంబంధించిన|}} {{c|అపరాధములగురించి

కూట రచన

463. ప్రజల కైనను, ఎవరేని వ్యక్తి కైనను చెరుపును లేదా హానిని కలిగించవలెననెడి, లేక ఏదేని క్లెయిము నైనను, హక్కునై నను బలపరచవలెననెడి, లేక ఏ వ్యక్తినైనను ఆస్తిని వదలు కోనున్నట్లు గనో ఏదేని కాంట్రాక్టును,అభివ్యక్త మైనదై నసు, గర్భితమై నదైనను, చేసికోనున్నట్లు గనో చేయవలెననెడి ఉద్దేశముతో గాని, కపటమునకు గురి చేయవలెనను, లేదా కపటమునకు గురి చేయవచ్చునను ఉద్దేశముతో గాని, ఏదేని తప్పుడు దస్తా వేజునై నను దస్తా వేజులో ఒక భాగమునైనను రూపొందించు వారెవరైనను కూటరచన చేసిన వారగుదురు.

464 ఒక వ్యక్తి —

తప్పుడు దస్తా వేజును రూపొందించుట.

మొదటిది: ఒక దస్తావేజు లేదా ఒక దస్తా వేజు నందలి భాగము, ఏ వ్యక్తి చే లేదా ఏవ్యక్తి ప్రాధికారమును బట్టి, రూపొందించబడలేదని, సంతకము చేయబడలేదని, ముద్ర వేయబడ లేదని, లేదా నిష్పాదింపబడలేదని తాను ఎరిగి యున్నాడో, ఏ సమయమున అది రూపొందించబడలేదని, సంతకము చేయబడలేదని, ముద్ర వేయబడలేదని, లేదా నిప్పాదింపబడలేదని తాను ఎరిగి యున్నాడో ఆ సమయమున గాని, ఆ వ్యక్తి చేగాని, ఆ వ్యక్తి ప్రాధికారమునుబట్టి గాని అది రూపొందింపబడినదని, సంతకము చేయబడినదని, లేదా నిష్పాదింపబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో నిజాయితీ లేకుండనై నను, కపటముతోనై నను అట్టి దస్తావేజును, లేదా దస్తా వేజునందలి భాగమును రూపొందించుచో లేదా దాని పై సంతకము చేయుచో, లేదా ముద్ర వేయు చో, లేక దానిని నిష్పాదించుచో, లేదా దస్తా వేజు నిష్పాదింప బడినట్లు సూచించు ఏదేని గుర్తును దాని పై వేయుచో, లేక

రెండవది : తనచేగాని, ఎవరేని ఇతర వ్యక్తి చేగాని, ఒక దస్తావేజు రూపొందింపబడిన తరువాత, లేక నిష్పాదింపబడిన తరువాత దానిలో మార్పు చేయుటకు శాసన సమ్మత ప్రాధికారము లేకుండియు, సూర్పుచేయు సమయమున అట్టి ఇతర వ్యక్తి జీవించియున్నను లేక మరణించి యున్నను, నిజాయితీ లేకుండగాని, కపటముతోగాని రద్దు పరచుటద్వారా అయినను, అన్యధా అయినను ఆ దస్తా వేజులోని, ఏదేని ముఖ్యాంశమును మార్పు చేయుచో, లేక

మూడవది : దస్తా వేజులోని విషయములనుగాని, దానిలో చేయు మార్పు యొక్క స్వభావమునుగాని, మతి స్తిమితము లేనందున, లేదా మత్తులో ఉన్నందున ఎవరేని వ్యక్తి తెలిసికొనజాలకున్నాడని, లేక మోసగించబడినందున