పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్చన్నమున చేసినందుకు శిక్ష.

453. ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్చన్నమున చేయు లేక ఇంటికి కన్నము వేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండ గల కాలావధికి రెంటిలో ఒకరకపు కారా వాసముతొ శిక్షింపబడుదురు, మరియ: జుర్మానాకు కూడ పాఅ పాత్రులగుదురు.

కాలావాసముతో శిక్షింపుదగు అపరాధమును చేయుటకుగాను ఇంట -అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నము, చేయుట లేక ఇంటికి కన్నము వేయుట,

454. కారావాసముతో శిక్షింపదగు ఏదేని అపరాధమును చేయుటకు గాను ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్చన్నముగ చేయు లేక ఇంటికి కన్నము వేయు వారెవరైనను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు, జుర్మానాకు కూడ పాత్రులగుదురు. మరియు చేయుటకు ఉద్దేశింపబడిన ఆపరాధము దొంగతనమగుచో కారావానపు కాలావధిని పది సంవత్సరములదాక పొడిగింపవచ్చును.

మాత, దౌర్జన్యము లేక అక్రమ అవరోధమునకు సన్నాహము చేసికొన్న పిమ్మట ఇంట అక్రమ ప్రవేశము.ప్రచ్చన్నముగ చేయుట లేక ఇంట -- కన్నము వేయుట.

455. ఏ వ్యక్తికైనను ఘాత కలిగించుటకు లేక ఏ వ్యక్తి పై నైనను దౌర్జన్యము చేయుటకు, లేక ఏ వ్యక్తి నైనను అక్రమముగ అవరోధించుటకు, లేక ఏ వ్యక్తి నై నను ఘాతకు గాని, దౌర్జన్యమునకు గాని, అక్రమ అవరోధమునకు గాని గురిజేయుదునని భయ పెట్టుటకు సన్నాహము చేసియుండి, ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగ చేయు, లేక ఇంటికి కన్నము వేయు నతడెవరై నను, పది సంసత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్టింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

రాత్రిపూట ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగా చేసినందుకు లేక ఇంటికి కన్నము చేసినందుకు శిక్ష.

456. రాత్రిపూట ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగ జేయు లేక రాత్రిపూట ఇంటికి కన్నము వేయు వారెవరై నను. మూడు సంవత్సరములగాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు,

కారావాసముతో శిక్షింపదగు అపరాధము చేయుటకుగాను రాత్రివేళ ప్రచ్ఛన్నముగ ఇంట అక్రమ ప్రవేశము చేయుట లేక ఇంటికి కన్నము చేయుట.

457. కారావాసముతో శిక్షింపదగు ఏదేని అపరాధమును చేయుటకు గాను రాత్రిపూట ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగ జేయు, లేక ఇంటికి కన్నము చేయు వారెవరై నను ఆరు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, మరియు చేయుటకు ఉద్దేశింప బడిన అపరాదము దొంగతనమగుచో కారావాసపు కాలావధిని పదునాలుగు సంవత్సరములు దాక పొడిగించ వచ్చును .


ఘాత, దౌర్జన్యము లేక అక్రమ అవరోధమునకు సన్నాహము చేసికొన్న పిమ్మట రాత్రివేళ ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నము చేయుట లేక ఇంటికి కన్నము వేయుట.

458. ఏ వ్యక్తి కైనను ఘాత కలిగించుటకు, లేక ఏ వ్యక్తి పై నై నను పౌర్బన్యము చేయుటకు, లేక ఏ వ్యక్తి నైనను అక్రమముగ అవరోధించుటకు, లేక ఏవ్యక్తి నై నను ఘాతకు గాని, దౌర్జన్యమునకు గాని, అక్రమ అవరోధమునకు గాని గురిచేయుదునని భయ పెట్టుటకు సన్నాహము చేసియుండి, రాత్రివేళ ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగా చేయు, లేక రాత్రిపూట ఇంటికి కన్నము వేయు వారెవరై నను, పదునాలుగు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసము తొ శిక్షింప బడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగ చేయుటలోగాని ఇంటికి కన్నము వేయుటలోగాని దారుణ ఘాత కలుగజేయుట.

459. ఇంట- అక్రమ ప్రవేశమున ప్రచ్ఛన్నము చేయుటలో గాసి, ఇంటికి కన్నము వేయుటలో గాని, ఏ వ్యక్తి కై నను దారుణ ఘాత కలుగజేయు, లేక ఏ వ్యక్తి కై నను మరణమునై నను దారుణ ఘాతనై నను కలుగజేయుటకు ప్రయత్నించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.