పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(సీ) కిటికీ గుండా 'జడ్' యొక్క ఇంటిలోనికి ప్రవేశించుట ద్వారా 'ఏ' అనునతడు ఇంట అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(డీ) గడియ వేయబడిన తలుపును తెరచుకొని 'జడ్' యొక్క ఇంటిలో ప్రవేశించుట ద్వారా 'ఏ' అనునతడు ఇంట అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(ఈ) తలుపులోని రంధ్రము గుండా ఒక తీగెను దూర్చి గడియను ఎత్తి తలుపు తెరిచి 'జడ్' యొక్క ఇంటిలోనికి ప్రవేశించుట ద్వారా 'ఏ' ఇంట అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(ఎఫ్) 'జడ్' పోగొట్టు కొన్నట్టి 'జడ్' ఇంటి తాళముచెవి 'ఏ' అనువానికి దొరకగా అతడు ఆ తాళము చెవితో తలుపును తెరచి 'జడ్' ఇంటిలో ప్రవేశించుటద్వారా ఇంట అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(జి) 'జడ్' తన ఇంటి వాకిలి వద్ద నిలచియున్నాడు. 'జడ్' ను క్రింద పడదొసి 'ఏ' అనునతడు బలాత్కారముగ త్రోవ చేసికొని ఆ ఇంటిలో ప్రవేశించుటద్వారా ఇంట -అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

{ హెచ్) 'వై' యొక్క ద్వారపాలకుడైన 'జడ్' 'వై' యొక్క వాకిలివద్ద నిలిచియున్నాడు. 'జడ్' ను కొట్టుదునని బెదిరించి తనను అడ్డ కుండా భయ పెట్టి 'ఏ' అనునతడు ఇంటిలో ప్రవేశించుట ద్వారా ఇంట అక్రమ ప్రవేశము,చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట ఆగును.


446. సూర్యాస్త మయమైన తర్వాత, తిరిగి సూర్యోదయము కాకముందు ఇంట కన్నము వేయువారెవరై నను “రాత్రివేళ ఇంటికి కన్నము వేసినట్లు" చెప్పుబడుదురు.

ఆపరాధిక అక్రమ ప్రవేశమునకు శిక్ష.

447. అపరాధిక అక్రమ ప్రవేశము చేయువారెవరైనను మూడు మాసములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఐదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుడురు.

ఇంట- అక్రమ ప్రవేశమునకు శిక్ష.

448. ఇంట- అక్రమ ప్రవేశము చేయువారెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలొ ఖట ఆక్రము ప్రవేశ ఒక రకపు కారావాసముతో గాని ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు

మరణ దండనతో శిక్షింపదగు ఆపరాధమును చేయుటకుగాను ఇంట- అక్రమ ప్రవేశము,

449. మరణ దండవతో శిక్షింపదగు ఏదేని ఆపరాధమును చేయుటకుగాను ఇంట అక్రమ ప్రవేశము చేయువారెవరైనను యావజ్జీవ కారావాసముతొ గాని, పది సంవత్సరములకు మించని కాలావధికి కఠిన కారావాసముతో గాని, శిక్షింపబడుదురు; మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయుటకుగాను ఇంట-అక్రమ ప్రవేశము.

450. యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు ఆపరాధమును చేయుటకుగాను ఇంట అక్రమ ప్రవేశము చేయువారెవరైనను, పది సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయుటకుగాను ఇంట-అక్రమ ప్రవేశము.

451, కారావాసముతో శిక్షింపదగు ఏదేని అపరాధమును చేయుటకుగాను ఇంట అక్రమ ప్రవేశము చేయు వారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. మరియు చేయుటకు ఉద్దేశింపబడిన అపరాధము దొంగతనమగుచో కాలా వాసపు కాలావధిని ఏడు సంవత్సరముల దాక పొడిగించవచ్చును.

ఘాత, దౌర్జ న్యము,లేక అక్రమ అవరొధమునకు సన్నాహము చేసికొన్న పిమ్మట ఇంట అక్రమ ప్రవేశము.

452. ఏ వ్యక్తి కై నను ఘాత కలిగించుటకు లేక ఏ వ్యక్తి పై నను దౌర్జన్యము చేయుటకు లేక ఏ వ్యక్తి నైనను అక్రమముగా అవరోధించుటకు లేక ఏ వ్యక్తి నై నను ఘాతకుగాని, దౌర్జన్యమునకుగాని, అక్రమ అవరోధమునకు గాని గురి చేయుదునని భయ పెట్టుటకు సన్నాహము చేసియుండి ఇంటా అక్రమ ప్రవేశము చేయు నతడెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షించబడును. మరియు జుర్మానాకు కూడా పాత్రుడగును.