పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9


ద్వీపాంతర వాసమును గూర్చిన నిర్దేశపు అన్వయము,

53- ఏ (1) తత్సమయమున అమలులో నుండు ఏదేని ఇతర శాసనములో గాని, ఏదేని ఆట్టి శాసనమును బట్టియైనను, రద్దు చేయబడిన ఏదేని ఆనుశాసనమును బట్టియైనను ప్రభావము కలిగియున్న ఏదేని లిఖిత పత్రములో లేక ఉత్తరువులో గాని, " యావజ్జీవ ద్వీపాంతర వాసము"ను గూర్చిన నిర్దేశమును దేనినైనను, ఉపపరిచ్ఛేదము మరియు ఉపపరిచ్ఛేదము (3) యొక్క నిబంధనలకు లోబడి, “యావజ్జీవ కారావాసము" ను గూర్చిన నిర్దేశముగా అన్వయించవలెను.

(2) క్రిమినలు ప్రక్రియా స్మృతి ( సవరణ) చట్టము, 1955 (1955లోని 26వ చట్టము) యొక్క ప్రారంభమునకు పూర్వము నిర్ధిష్ట కాలావధిక ద్వీపాంతరవాస దండనోత్తరువు ఈయబడిన ప్రతి కేసులోను ఆదే కాలావధికి కఠిన కారావాస దండనోత్తరువు ఈయబడిన ఎట్లో అదేరీతిగా అపరాధిని శిక్షించవలెను.

(3) తత్సమయమున అమలులోనుండు ఏదేని ఇతర శాసనములో కాలావధిక ద్వీపాంతరవాసమును గూర్చిన లేక (పేరు ఏదైనను) ఏదేని లఘుతర కాలావధిక ద్వీపాంతరవాసమును గూర్చిన ఏ నిర్దేశమనను వదలివేయబడినట్లు భావించవలెను.

(4) తత్సమయమున అమలులో నుండు ఏదేని ఇతర శాసనములోని “ద్వీపాంతరవాసము"ను గూర్చిన ఏ నిర్దేశమునైనను——

(ఏ) ఆ పదబంధమునకు అర్థము "యావజ్జీవ ద్వీపాంతర వాసము" అయినచో, “యావజ్జీవ కారావాసము" ను గూర్చిన నిర్దేశముగా, అన్వయించవలెను.

(బీ} ఆ పదబంధమునకు అర్థము ఏదేని లఘుతర కాలావధిక ద్వీపాంతరవాసము అయినచో, ఆ నిర్దేశము వదలి వేయబడినట్లు భావించవలెను.

మరణదండనను లఘాకరించుట.

54. మరణ దండనోత్త రువు ఈయబడిన ప్రతి కేసులోను సమంచిత ప్రభుత్వము, అపరాధి యొక్క సమ్మతి లేకుండగనే, ఆ శిక్షను ఈ స్మృతి నిబంధనల యందలి ఏదేని ఇతర శిక్షగా లఘాకరించ వచ్చును.

యావజ్జీవ కారావాస దండనను లఘాకరించుట.

55. యావజ్జీవకారావాస దండనోత్తరువు ఈయబడిన ప్రతి కేసులోను, సముచిత ప్రభుత్వము ఆపరాధి సమ్మతి లేకుండగనే, ఆ శిక్షను పదునాలుగు సంవత్సరములకు మించని కాలావధికి, రెంటిలో ఒక రకపు కారావాసమునకు లఘకరించవచ్చును.

55-ఏ. 54వ మరియు 55వ పరిచ్ఛేదములలో “ సముచిత ప్రభుత్వము" అనగా,——

సముచిత ప్రభుత్వము నిర్వచనము.

(ఏ) ఆ దండనోత్తరువు మరణ దండనోత్తరువు అయిన కేసులలోగాని, సంఘము యొక్క కార్యపాలకాధికారము విస్తరించు విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమును ఉల్లంఘించి చేసిన అపరాధమును గురించిన దండనోత్తరువు అయిన కేసులలో గాని, కేంద్ర ప్రభుత్వము అని అర్థము.

ఆ దండనోత్తరువు (మరణ దండనోత్తరువు. అయినను. కాకున్నను ) రాజ్య కార్యపాలకాధికారము విస్తరించు విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమును ఉల్లంఘించి చేసిన అపరాధమును గురించినదైన కేసులతో ఏ రాజ్యములో అపరాధిపై దండనోత్తరువు ఈయబడినదో ఆ రాజ్య ప్రభుత్వము, అని అర్థము.

56.X X X X X X

శిక్ష కాలావధుల భిన్నములు.

57. శిక్ష కాలావధుల భిన్నములను లెక్క వేయుటలో, కారావాసమునకు సమానమై నదిగా లెక్కించవలెను. యావజ్జీవ కారావాసమును ఇరువది సంవత్సరముల కారావాసమునకు సమానమై నదిగా లెక్కించవలెను.

58. X X X X X X X X X X X X

59. X X X X X X X X X X X X

దండన (కొన్ని కారావాసపు కేసులలో) పూర్ణత: లేక భాగతః కఠినమైనదిగాగాని సాధారణమైనదిగాగాని ఉండవచ్చును.

60. అపరాధిని రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపదగియున్న ప్రతి కేసులోను, అట్టి కారావాసము పూర్ణత: కఠినమైనదిగ యుండవలెనని గాని, పూర్ణత: సాధారణమై నదిగ యుండవలెనని గాని, అట్టి కారావాసములో కొంత భాగము కఠినమైనదిగను మిగతా భాగము సాధారణమైనదిగను యుండవలెనని గాని, దండనోత్తరువులో ఆదేశించుటకు అట్టి ఆపరాధిని దండించు న్యాయస్థానము సమర్ధమైనదై యుండును.