పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తాకినంత [1]ధరాధినేతలు గణించ
శిల నళిననేత్రయై నిల్చె జిత్రకళల.

33


చ.

నిలిచిన యాయహల్య, ధరణీతనయేశితకాళ్ళచెంత సా
గిలి, నతిఁ జేసి, లేచి తనకేల్ నిటలస్థలి నంటఁ జేర్చఁగా
దెలియక గాధిజాతజటి దిక్కటుగాంచినఁ జేరనేగి తాఁ
గలిగిన గాథ దృష్టగతిగా నెఱిఁగించఁగసాగె నయ్యెడన్.

34


క.

ఇక్కాననాంతరస్థలి
జక్కన నరికాలికంటిజడదారికి దీ
రెక్కిన గేహిని యయి ధర
నక్కఱ గననయ్యె దా నహల్యాఖ్య తగన్.

35


ఉ.

చక్కఁదనాలటెంకి, నెరజాణ నహల్యఁ గళానయక్రియన్
జిక్కఁగ నందఱల్ గణనసేయ నెఱింగి ధరాధరారి తా
నక్కఱదేర నంగజకరాగ్రలతాంతశరాగ్రకీలలన్
జిక్కి తదాశ్రయస్థలికిఁ జేరఁగ నేగి రహస్యచర్యచేన్.

36


ఆ.

అక్షచరణజటి[2]గ, నాకృతిఁ దాల్చి య
హల్యఁ గదియ జనిన నానగారి
చిహ్న లరసి సంతసిల్లి యంగీకార
సరణి దిరిగి సదన జగతి నిలిచె.

37


వ.

అంత.

38


చ.

తనలతికాగృహస్థలి హితస్థితి నిల్చిన నీరజాననన్
గని యచలాచలారి నెఱకాకలఁ దాళఁగలేక చేరఁగాఁ
జని జిగిఁ కౌఁగిలించి, రతిసారతరక్రియ దాల్చె స్రక్చర
స్తనజలధార లేర్లగతి జారఁగ హర్షితచేత దేలఁగాన్.

39


వ.

ఇ ట్లహల్య నంగజకేళి సంతసిల్లఁ జేసి చన నంత.

40
  1. నిశాధి (శి)
  2. ఘనాకృతి (ము)