పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధరణి జారినయది గాన దశరథేశ
నందనాగ్రణి! లెస్స గానంగరాదె.

29


క.

ఆ గంగాహ్రాదిని తా
సాగరసంగతి [1]నొనర్చె జనసంచయచం
డాగస్స్థితి నడగించఁగ
శ్రీగతి సద్గతి ఘటిల్లఁజేయఁగ ధరణిన్.

30


క.

అని గాధిజాతజటి చ
క్కన గంగాతటిని జననగతి దెలియఁగజే
సిన నాలకించి దశరథ
తనయాగ్రణి సంతసిల్లి దారిఁ జనంగన్.

31


చ.

ఇలహరధాతలైన గణియించఁగరాని నిశాచరారిస
జ్జలజఘటాండజాతసృణిసారసచక్రదృఢాంఘ్రిఁ చాకినన్
శిల నళినాయతాక్షి యయి [2]చిత్రకథాతిశయాచ్ఛలీలలన్
నిలిచెఁ దదగ్రధాత్రి జటి నేత లటం గని సంశయించగన్.

32


సీ.

అచలారి నిరసించినట్టి రాక్షసనేత
             నచలక్రిందికి దన్నినట్టి యంఘ్ర
[3]సత్యజగత్ స్థలి చక్కికై సాచిన
             నలశత ధృతికడ్గినట్టి యంఘ్రి
సకలఋషిశ్రేణి సంతతాసక్తిచే
             సరసి హృత్కలి దాల్చినట్టి యంఘ్రి
కలశనీరధికన్యకాస్తనఘట్టన
             నతిశయిల్లఁగ జేసినట్టి యంఘ్రి
[4]యనఁగ సనకసనందనాద్యఖిలఖచర
యతితతికినైన గనరాని యట్టియంఘ్రి

  1. దనర్చె
  2. చిత్రకళాతి (శి)
  3. 33వ పద్యములో 2,3 చరణములు (శి. లో)
    చక్కగా నింగికిఁజాచి నాధత చేత నారాధనల్ గాంచినట్టి యంఘ్రి; .... ఘనఘనాశ్రేణి చెండాడగా గంగ నక్కఱచే గన్నయట్టి యంఘ్రి
  4. అనఘ (శి)