Jump to content

పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

దశరథరాజనందనచరిత్ర

ద్వితీయాశ్వాసము

క.⁠

శ్రీలలనాపీనస్తన
పాళిజఘనభర[1]చికురబంధాగ్రసదా
[2]లోలకర నఖర శిఖరద
యాలక్షణ సీమ కర్పరాద్రి నృసింహ.

⁠ 1


వ.⁠

ఆతఱిఁ గథాసరణి యెట్లంటేని.

⁠ 2


చ.⁠

జనకధరాధినేత సరసస్ధితి యజ్ఞకరేచ్ఛఁ దా ధరా
జనతతి రా దిశల్ గలయఁజాటఁగఁ జేసిన [3]నాలకించి కాం
చనరథగంధనాగహయసైనిక[4]సంతతిచే హళాహళిన్
దననగరాంతరస్థలి హితక్రియ నిండఁగ సాగి రయ్యెడన్.

⁠ 3


ఉ.⁠

ఈగతి యజ్ఞదీక్షఁ గన నెల్లధరాతల[5]నేత లేగరా
నాగతి గాధిజాత జటిలాగ్రణి యారసి, రాక్షసారికిన్
శ్రీగల యట్టి యర్ధ జయసిద్ధి గదాయని నిశ్చయించి తా
రాగరసస్థితిన్ గదలె రాచనెలల్ తన చెంత నంటఁగన్.

⁠ 4


వ.⁠

[6]ఇట్లు నానాటికి యాత్రాసరణి గాధేయజటిం గాంచి దాశరథి
యిట్లనియె.

⁠ 5


క.⁠

ఇదియే జటిరాజస్థలి
యది గంగాతటిని [7]దాని యాగతి యంతా
చెదరఁగ దెలియఁగ జేయఁగ
గదె యన రాక్షసారిఁ గని నయసరణిన్.

⁠ 6
  1. ↑ చికుల (ము)
  2. ↑ లాల (ము)
  3. ↑ నాలకించు (ము)
  4. ↑ సంగతి (శి)
  5. ↑ నేత లేగగా (శి)
  6. ↑ అట్ల నానాటికి (శి)
  7. ↑ దీని (శి)