పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని గణించి.

94


క.

అనఘా! తాటక యనఁగా
ఘనరజనీచరలతాంగి కల, దద్దానిన్
గని దిగధినేతలైనను
జనఁగా లేరచటికైన జడయికచేతన్.

95


క.

చెన్నటి నడఁకలఁ దాటక
గన్నట్టి నిశాచరాధికర్త లు గలరే
నెన్నిక చేసిన యిష్టిన్
సన్నక సన్నజని చేరసాగిరి యల్కన్.

96


వ.

అది [1]గాన నీతనయాగ్రగణిని నతనిదాయిని నాకిచ్చిన దాటకేయ
నిశాటకర్తల జయించజేసి యాగదీక్షఁ గడఁదేరించెద నాచెంత ననంత
కల్యాణసిద్ధి కాఁగలదనిన.

97


క.

తనహృస్థలి యదురఁగ దృ
గ్జనితసలిలధార లెదిగి జారఁగ నజనం
దనరాజ హేళి యాజటిఁ
గని దైన్యరసాతిశయత గ్రాలఁగనాడెన్.

98


ఉ.

కానక కన్న చిన్న, లదిగాక దృఢక్రియఁ దండ్రి రాక యే
కానల కేఁగ నేరిచిరె, కానల కేఁగిన దండి నిల్చి యా
శానరనాథచిత్త శితశల్య నిశాచర నేతలన్ రణ
స్థాని [2]నెదిర్చగాఁగలఁరె శంకిలకే తెగియాడ నేలయా.

99


సీ.

రణధాత్రి నంగజారాతి యేతెంచిన
             [3]గేలి జేసెడి యక్కటిలచేత
నాకాశకషణ దీర్ఘాకార చర్యల
             గట్ల గేరెడి కరిఘటలచేత
త్రిదశ ధరాధరశృంగతేజి క్రియల్
             తేగటించెడి దండి తేర్లచేత

  1. గనుక (ము)
  2. నెదుర (ము)
  3. గేళి (ము)