పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాంతి [1]సంరాజితాంఘ్రియై గాధినంద
నర్షి యేతెంచె సంతతానందసక్తి.

87


క.

తనకడ కేతెంచిన జటిఁ
గని దశరథ ధరణినేత కాళ్ల కెఱఁగి చ
క్కని కాంచనాసనస్థలి
దనర నధిష్టించఁజేసి దాక్షిణ్యగతిన్.

88


ఉ.

శ్రీకర సత్యశీల యతిశేఖర సారదయానిధాన నీ
రాకడచేత నెల్లనఘరాశి యడంగె ననేకసత్క్రియా
నీకరతిన్ దనర్చితి ననిందితకీర్తి ఘటిల్లె సంతత
శ్రీకిల డెంకి నైతి జయసిద్ధి గ్రహించితినయ్య చక్కఁగాన్.

89


క.

హరిగంధగజస్యందన
హరిహయధనధాన్యరత్నహాటకశాటీ
హరిచందనాదికాంక్షల్
సిరి నిచ్చెద నడుగరాదె శ్రేయస్సిద్ధిన్.

90


ఆ.

అనిన సంతసిల్లి యాజటిలాగ్రణి
దశరథక్షితీశ తరణిఁ గాంచి
సరసదంతకాంతిదరహాసచంద్రికల్
జెల్ల గణన జేసి చెల్లనాడె.

91


క.

లేదా ధరిత్రిరానెల
లీరా! సకలార్థకాంత లెన్నకఁ జిహ్నల్
దేరా! యన్నిఁట జాణల్
గారా! నీసరణి నడకఁ గనరై రనఘా.

92


చ.

సలలితకీర్తి నిండ నినసంతతి గల్గిన రాజరాజి తా
నలయిక చేతనైన గడ హాస్యరసస్థితినైన నిద్రలన్
గలఁగనియైన నాడినది కల్లన నేరనీయట్టి సత్యని
ష్ఠలఁ దనరాఁరెగాదె త్రిజగజ్జనకీర్తన లర్థి హెచ్చఁగాన్.

93
  1. నద్రాజి(వ్రా)