పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనెనట; ఈవిధముగనే సింగరాచార్యుల తర్వాతకవులును తమగృహనామవిషయమై తెల్పిరి. 'గోదావధూటీపరిణయము' (కృత్యాది. 25,26 నెం. పద్యములు) తాలాంకనందనీపరిణయమును ఇట్లే తెలుపుచున్నవి. తా. నం. పరిణయములో-

'కంటిమిమిము కూరేశులఁ
గంటిమి మీవెంట వచ్చు ఘను లెవరో మఱిం
గంటి మని బల్క నది మా
కింటికి పేరుంట నా మహిన్ రహి కెక్కెన్.'

(కృత్యాది)

అని గలదు. ఆసూరివారు ఈకారణాన మరింగంటివారై ఆసూరి మరింగంటి యనబడుచున్నారు.[1]

వీరు మౌద్గల్యగోత్రులు, హెచ్చుగా లక్ష్మీనృసింహవేంకటేశ్వరభక్తులు.

దశరథరాజనందనచరిత్రలో 'కవివంశవర్ణనము’న గలవారియందు సింగరాచార్యులకు పూర్వముగల వారిరచనలు ఏవియు లభించలేదు. వారును ప్రౌఢకవులే! ద. రా. నం. చ.[2]కృత్యాది ననుసరించి వంశవృక్షమును ముందొసంగుచున్నాను. దాని ప్రకారముగా తెలియవచ్చువారు-

1. చెన్నయాచార్యులు:- 'సకలరాజాధిరాజరాజమకుటాగ్రఘటిత చిరత్నరత్నబహుళనీరాజనాతి విభ్రాజితాంఘ్రిసరసిజుఁ 'డైన ఈ చెన్నయాచార్యులు మాధవగురుని పుత్రుడు. విశేషమేమనగా పుట్టుకతో నితడు సర్పరూపిగా కన్పించినవాడు. ఈయన మాహాత్మ్యము ద. రా. నం. చ, ని.సీ. క కృత్యాదులయందు 'గోదా..' యందును వర్ణింపబడినది. ఈయన బహుశాస్త్రనిష్ణాతుడట. పణ్కరాజుపల్లి గుట్టపై ఈయన నివాసము. ఈపణ్కరాజువల్లి యను గ్రామము ప్రస్తుతము మిర్యాలగూడెం తాలూకాలోని అడవిదేవులపల్లి గ్రామమునకు సమీపమున గలదు. ఆ గుట్టపై నరసింహ

  1. మరింగంటివా రని వచ్చుటకు పైకారణము కవికల్పితమేమో "మరికల్లు" అనుగ్రామము ననుసరించి మరింగంటి, మరిగంటిలగు అవకాశము గలదు. మరికల్లు పేరుగల గ్రామములు దేవరకొండ, నల్లగొండ, మహబూబ్ నగరం తాలూకాలలో గలవు.
  2. ద. రా. నం. చ. = దశరథరాజనందనచరిత్ర. ని. సీ. క. = (శుద్ధాంధ్ర)నిరోష్ఠ్యసీతాకళ్యాణము.