పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠ్యంతములు

క.

ఏతాదృశగుణశాలికి,
ధాతృముఖాదిత్యగణితదానాతిశయ
ఖ్యాతికళాభూతికళా
నీతికళాన్వితునకున్ మునిప్రీతునకున్.

34


క.

సురసేవితచరణావిత
హరజీవితునకు నిలింపయతివినుతునకున్
సురరక్షా౽సురశిక్షా
వరదీక్షాదక్షునకుఁ, గృపావీక్షునకున్.

35


క.

బలతారాచలతారా
కులమారాహితవళక్షగురుయశున, కిలా
బలధీరాచలవారా
నలఘోరాకారునకు గుణస్ఫారునకున్.

36


క.

వననిధికన్యాకుచనత
ఘననఖరత్రుటితదితిజకఠినోదరసం
జనితాసృగ్జనదూరిత
కనదాగ్రహదహనునకు జగద్వహనునకున్.

37


క.

హీరఘటీ తారపుటీ
హీరపటీరారి మకుటహరిసామజ[1] కం
జారి పుటీభూరినటీ
హారిసుహృద్భక్తునకు దయాసక్తునకున్.

38


క.

చక్రాహత వక్రాహిత
నక్రాధిపమస్తకునకు నగకన్యారా
ట్చక్రద్రుహిణక్రౌంచజి
దక్రూరప్రణితఘృణికి నరిగజసృణికిన్.

39
  1. కుంజార (ము)