పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్లోకరుచుల్ దిగంతముల లోకములన్ బ్రసరింపఁజేయు వా
ల్మీకి బరాశరాత్మజు నమేయకవీంద్రుల బ్రస్తుతించెదన్.

7


గీ.

రాజపూజితు వేదశాస్త్రప్రవీణు,
సరససాహిత్యలక్షణచక్రవర్తి,
నుభయభాషాకవిత్వధుర్యుని మదగ్ర
జన్ము మఱిఁగంటి యప్పలాచార్యు నెంతు.

8


సీ.

జలజాక్ష పరికరాంశప్రభూతాత్ముల
             బన్నిద్దరాళ్వార్లఁ బ్రణుతి సేసి,
పంచనంబుల శాస్త్రపారీణుల భజించి
             యామునాచార్యుల నభినుతించి,
రామమిశ్రుల నతిప్రేమచే గీర్తించి
             ఘనుల శ్రీమన్నాథమునుల బొగడి,
పెరియజీయరు శిష్యసురకల్పకము నెన్ని
             సూరిదూప్పిల్ పిళ్లగారి దలఁచి


గీ.

వాసి డెబ్బదినాల్గుసింహాసనముల
గురువుల సమగ్రవైభవాకరులఁ గొలిచి
[1]సిరుల మాతలిదండ్రుల వరదమాంబ
వేంగళార్యుల హృద్వీథి వేడ్క నిలిపి.

9


ఉ.

ఆరయ శబ్దహీనమగునట్టి పదస్థితి గల్గి పై నలం
కారము [2]లెవ్వి చేకుఱక క్రమ్మినశయ్యల సంధి [3]దేలుచున్,
గౌరవవృత్తి నర్ధముల గానని [4]యాకవిచోరకోటి ని
స్సారము సేయఁగావలె వెసన్ ద్విజరాజకళాసమృద్ధిచేన్.

10


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును, బూర్వాచార్యసంకీర్తనంబును, గుకవి
దూషణంబును గావించి మదీయవంశావతారం బభివర్ణించెద -

  1. సరళి (సా)
  2. దెల్పి చేకొనక (సా)
  3. దెల్పుచున్ (సా)
  4. కాకవిజారకోటి (సా)