పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

[1]తనయనురాగవృద్ధి విదితంబుగ వెన్నుఁడు చూపుపోల్కిఁ జ
క్కనియురమందు భాసిలెడు కౌస్తుభరత్నము [2]చేతఁ జూడఁగాఁ
జనువుపసిండిబొమ్మక్రియ సంతస మొప్ప వసించునట్టి యా
ననవిలుకాని తల్లియగు [3]నాతుక మాగృహసీమ [4]నుండుతన్.

3


చ.

హరికిఁ బయోధిపుత్రికి నుదంచితతల్పకమై, సహస్రభో
గరుచిరరత్నదీపకళికాప్రకరప్రభవత్ప్రకాశవి
స్ఫురణల లోకనిర్మలత బూనఁగఁ జేయుచు సర్వదాస్యవై
ఖరి రచియించు శేషఫణికాంతుఁడు మాకు శుభోక్తు లీవుతన్.

4


సీ.

[5]ఊతచే నెగయంగ నూర్ధ్వదేశంబుల
             బ్రహ్మాండభాండ కర్పరమునంట,
వాలంబు పురివిప్ప జాల దిక్పాలుర
             పట్టణంబులు పరవంజికప్పఁ
బక్షముల్ విసరెడి పవనవేగంబున
             గిరులు గృధ్రంబులకరణి నాడ,
నుంకించి త్రొక్కంగ నుర్వీతలంబెల్ల
             నహిలోకపర్యంత మడఁగిపోవ,


గీ.

దనరి విశ్వప్రపంచమంతయు దానె
యగు విరాడ్రూపసంపత్తి నచ్యుతునకు
వాహనంబై నిశాటుల వడి జయించు
గరుఁడుని భజింతు క్షేమంబు గ్రందుకొనఁగ.

5


మ.

వనజాతప్రభవాండ దుష్టదనుజవ్రాతంబు శిక్షింప సం
జనితంబైన ప్రతాపరేఖ యనఁగా సౌవర్ణక్షేత్రంబుఁ గై
కొని లక్ష్మీపతిచెంతఁ చేరి భయభక్తు ల్మీర వర్తించు శో
భనసంశీలి, సువర్చలాసుతు మదిన్ భావింతు నశ్రాంతమున్.

6


ఉ.

శ్రీకరరామ భారతవిశేషకథాజలరాశిఁ దేలి య
స్తోకపదార్థరత్నములఁ దోరముగా బుధకోటి కిచ్చి సు

  1. తనయనుకాశ (సా)
  2. చెంత (సా)
  3. నాడుత (వ్రా)
  4. నెప్పుడున్ (వ్రా)
  5. ఊకచే (శి)