పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఇల కవితాప్రయాసమగు నెన్నికమై యుభయార్థకావ్యముల్
గల విపు డిట్ల విన్నయది గద్దిక ముందర గల్గనేర్చునే
తెలుఁగు నిరోష్ఠ్యపుంగృతి యిదే మఱిదక్కఁగ నిప్పటందులన్
గలుఁగదు వింటలేదె యిక కాఁగలజాడలు నెన్న నేటికిన్.

31


క.

తరమక ప్రతిపదములు ప
ల్మరు నరయుచు సముచితోక్తమార్గంబులనున్
బెఱఁగులఁ దెలియుచు నర్థం
బెఱఁగఁగ దగు నుభయసంధు లెనయుటకతనన్.

32


గీ.

అరయ [1]కగచజటడతద నా యలసహ
రద్వయమె కాని యొండక్షరములు చొఱవు
మఱియు నౌత్వోత్వములు కొమ్ము మాముడియును
వలవ దామీద సురభాష నిలుపరాదు.

33


క.

ఇల సురభాషల కొన్నిటి
తిలకింపఁగ వికటమనుచు తిరమగునామం
బులు కథలుఁ దెలియు[2]కొఱకై
నిలిపితి కవిసమ్మతాన నిల్కడగాఁగన్.

34


వ.

అని యిట్లు సకలసుకవిజనానందకందళితంబై యొప్పు యేతత్ప్రబంధ
నిర్మాణసామర్థ్యంబు నిరూపించి మదీయవంశావతారం బభివర్ణించెద.

35


గీ.

పరమద్రావిడయాసూశివంశవార్ధి
కుదిని శ్రీసాధుభట్టార్య గురువరుండు
కడుముదంబున బ్రభవించి ఘనత కెక్కె
పుడమి మౌద్గల్యఋషిగోత్రపూజ్యుఁ డనగ.

36


క.

నిరహేతుకకృపచేతను
సిరివరుఁడగురంగశాయి సిరు లింపొందనన్
కరుణాకటాక్షవీక్షణ
[3]గరిమన్ బ్రియపుత్రుఁ గాంచుకైవడి కూర్మిన్.

37
  1. కగచయ... (లి)
  2. కోసము (లి)
  3. గరిమతొ (లి)