పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పదియేండ్లనాడును బహుచమత్కృతులచే
             చక్రలాంఛనవిధిఁ జెప్పినావు
యెలమితో [1][2]పదునొకండేండ్ల బాలుడవయ్యు
             కవికదంబరచన గాంచినావు
వరుసతో పన్నెండువత్సరంబుల వేడ్క
             శతసంహితయుఁ దెన్గు జేసినావు
రమణ పదమూడుయేండ్లను రామకృష్ణ
చరితమెల్లను [3]ద్వ్యర్థిసంశ్లేష మొదవ
నాంధ్రభాషగ విరచించితౌర భువిని
శబ్ధశాసనబిరుదాంకశాలి వగుచు.

14


గీ.

వరుస పద్నాల్గుపదిహేనువత్సరముల
సరసకవితాష్టభాషావిశేషకృతుల
సరణు లేర్పడ నాటకశాస్త్రమెల్ల
గరిమ విరచించితివిగాదె కవుల నెంచ.

15


గీ.

అనఘ ప్రేమాభిరామ ధనాభిరామ
కావ్యములు జాతివార్తలుఁ గడలుకొనఁగ
ద్విపదలుగఁ జేసితివి కవినృపతు లెన్న
పూని షోడశవత్సరంబుననె మొదల.

16


క.

నలయాదవరఘుపాండవ
[4]సలలితురీయార్థకావ్యసంశ్లేషకృతుల్
యెలమి దశసప్తహాయన
మలవడుకాలంబునందు నతిమధురోక్తిన్.

17


సీ.

ఒనర పద్దెనిమిది సంవత్సరంబులనాడు
             సకల అలంకారసంగ్రహంబు
రాకాసుధాపూర్ణరసపుష్పగుచ్ఛంబు
             నాంధ్రభాషాభూషణాఖ్య కృతులు

  1. ('లి' యనగా దీనిమాతృకయైన 'లిఖితప్రతి')
  2. పదకొండేండ్ల ...(లి)
  3. వియ్య... (లి)
  4. సలలిత వియ్యార్థ (లి)