పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్యంచితచర్యలచే న
ర్తించెడి నీనటన లనఘ! తెలియఁగనేరన్.

87


34. క.

అని గణియించిన ధాతన్
గని యానందించి హృదయకంజస్థలసం
జనితదయారసధారల్
చినకఁగ నాశేషశాయి చీరి నయగతిన్.

88


35. చ.

అనఘచరిత్ర నీనడక లన్నిట లెస్సలె యర్ధిశైలశా
సనశిఖిహేళినందన నిశాచరనాయక నీరరాశినే
త్త్రనిలధరాధినాథ గిరిశాదిఖగస్థితి యంతకలత చ
క్కనె రజనీచరేంద్రకృతకాతరతల్ కడయయ్యెనేకదా!

89


36. తే.

కలక నీచెంత నిలిచిన ఖచరఘటల
యాన్యకళలెల్లఁ దిగజాఱె నరయ దాని
కేదిగతి యది లెస్సగా నెరుకసేయఁ
జక్కజేసెద నందఱు సంతసిల్ల.

90


37. వ.

అని యాడిన శేషశాయిం గాంచి.

91


38. క.

ఏ నజ్ఞానక్రియచే
గానక దశకంధరాఖ్యగలయమరున కీ
రానట్టి కాంక్ష లిచ్చితిఁ
గాన జగత్రయిఁ గలంచఁగాసాగెనయా!

92


39. సీ.

కన్నిచ్చ నచ్చరకన్నెల చెరసాగె
             నగ్రహారశ్రేణి నిగ్రహించె
నిఖిలధాత్రీలేఖనేతల చెండాడె
             యజ్ఞాదిసత్క్రియ లన్ని చెరచె
నతిథిజనార్చన లార్చె ఋషిశ్రేష్ఠ
             సంతతాచారనిష్టల హరించె