Jump to content

పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగబంధము

చంపకమాలావృత్తము

చ.

నరహరి ధీర సూరి వర నారద వర్ణిత గానలోల శ్రీ
వర కరుణా విచార కరివైరిహర స్థిర భోగపావనా!
నిరత నవీన హార ధర నీరజ పద్మవిహార భూరతా!
హరినగజాత సారసుత యాతత లంఘన చారువాససా!

(5-303)