పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖడ్గబంధము

ఉత్సాహ.

శౌరిశౌరి సూరి వంద్య శాప తాప [1]కోపనా
సూరిభూరివైరిహంస సోమసోమలోచనా
నారిదుర్విచారికర్ణనాసికా[2]విఖండనా
[3]వారితోగ్రదైత్యగర్వవన[4]కృశాను! పావనా.

309


మాలిని.

జనకలుషవిదూరా సర్వలోకైకవీరా
ఘనతరశుభగాత్రా కంధికన్యాకళత్రా
కనకరచితహేలా కద్రుగోపాలబాలా
ఘనతగుణవికీర్ణా కాండభాండప్రపూర్ణా.

310

గద్య
ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై
శ్వర్యధురీణ శారదాప్రశ్నవివరణ శతఘంటావధాన వినయధునీ
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధురవాగ్వైఖరీఝరీధురీణ
స్థాపితాశేష విశేషప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్ఠ్యాష్ఠ్యాది వింశతి
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్రపవిత్ర
తిరుమలదేశికేంద్ర పౌత్ర తిరువేంగళాచార్య పుత్ర
మఱింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన
దశరథరాజనందనచరిత్రయను మహాప్రబం
ధంబునందు పంచమాశ్వాసము
సర్వంబును సంపూర్ణము311

శ్రీశ్రీశ్రీ

  1. కోపనీ (ము)
  2. విదారినీ (ము)
  3. ర్వారితోగ్ర (ము)
  4. కృశాస (ము)