పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డ్జనతాహితజనసంతతి
[1]యనతానందాన జెలిఁగి యతిశయిలంగన్.

303


క.

ఎల్లదిశల జనతతికిం
దల్లిందండ్రి యన నధికధనధాన్యశ్రీ
సల్లలితస్థితి నుండఁగ
జల్లగ ధర యేలె జనకజాజాని తగన్.

304


క.

దిశల జనులెల్లఁ బొగడఁగ
దశరథనందనచరిత్ర ధాత్రి వెలయఁగా
నిశితమతిఁ జేసె నసదృశ
యశుఁడగు మఱిఁగంటి సింగరాచార్యుఁ డిలన్.

305


క.

శతధృతకర[2]కంజక్షా
ళితచరణసరోరుహాంగుళీజనరిత్వా
పితనేత్రాయుధశేఖర
దితిజాధిపవైరిదళన దృఢతరనఖరా.

306


[3]చ.

ఘనఘనసార సారసమృగప్రభుకుంభవతార తారకా
వననిధిరాజ రాజహరవాఘృణితాధిమనాగ నాగరా
ణ్ముఖునిపతీజవజ్రబృథనోకహచండునకుండ కుండవా
హనముఖకీర్తి కీర్తితనయప్రతిభాగుణవిక్రమోన్నతా.

307

నాగబంధము

చ.

నరహరి ధీరసూరివర నారదవర్ణితగానలోల శ్రీ
వరకరుణావిచార కరివైరిహర స్థిరభోగపావనా!
నిరతనవీనహారధర నీరజ[4]సద్మవిహార భూరతా
హరి[5]నగజాతసారసుత యాతతలంఘనచారువాససా.

308
  1. యనతానందజెలన డాసి నతిశయిలంగన్ (ము)
  2. కంజాక్షా! (ము)
  3. సంశయములతో అర్థరహితముగా గల పద్యము
  4. పద్మ (ము)
  5. నఘజాత (ము)