పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

శక్రనందనహరి సంహరించితి నిటఁ
             జెట్లందె దాగితిఁ జెలియ యిచట
ద్రాళ్ల నేడింటిని దరిగితి నిచ్చట
             గెడసిన రక్కసి గీటితి నిట
నర్కిసంగతి గంటి నరయంగ నిచ్చట
             నీయలంక్రియ లెచ్చె నెలఁత యిచట
యనిలజనగచారి నలరి కాంచితి నిట
             జెంచెత సత్క్రియల్ జేసి తిచట
దీర్ఘకరరాత్రిచరనేత ద్రెళ్లె నిచట
నర్కసారథితనయ ఖగాధినాథ
సంగరస్థలి యిది కంటె జలజనయన
కానఁగానయ్యె దళశాల కాంత! యిచట.

234


క.

తాటకతనయఖగారిన్
గీటఁడఁచితి నిచట నిఱ్ఱిక్రియ నేతేరన్
నెట్టించి యతఁడ చీఱిన
నాటినదయ [1]గల్గి దాయి నాకై రాగన్.

235


ఆ.

జరశరీర యైన జటిలీల నేతెంచి
కదసి కల్లలరసి దండనిలచి
తస్కరాన నిన్నె తనరధస్థలి నిడి
చనియె దితిజకర్త చాన యిచట.

236


క.

ఖరదైత్యాదినిశాచర
హరణక్రియచేత దండకారణ్యానన్
సరగనె నిష్కంటకగతి
జరుగఁగ జేసితిని యిట్టిచాయం జాయా!

237


క.

అల్లన దైతేయాగ్రణి
చెల్లెల్ నిన్నేచ దాయి శీఘ్రత గీసెన్

  1. కనె (ము)