పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

జననాయకహరి సీతం
దనదాయిని నెక్కఁజేసి తగినట్టియెడన్
జనఁదలఁచి యనర సరణిన్
దనరఁగ నాకాశగతిని దరలిన యంతన్.

229


మ.

రణధాత్రిం గనజేసి సీత యిచటన్ రాత్రించరాగ్రేశితన్
గణనాతీతశరాశి నేసి తలలన్ గండ్రించితిన్ గంటె కం
కణకాంతింగల తత్కరాలి దెగియన్ గంజాతనాళక్రియ
న్నణఁగంజేసితి నిచ్చటన్ గలశకర్ణాఖ్యాకదైత్యాగ్రణిన్.

230


సీ.

అతికాయఘననాథహననసంస్థలి యిదే!
             యదె యగ్నికేశసంహరణధాత్రి!
సకలరాత్రించరుల్ జచ్చిరి యిచ్చట
             జలరాశిఁ గట్టిరి సరగ నిచట!
నీరధి గననయ్యె నిజరీతి నిచ్చట
             గలసె రాత్రించరకర్త యిచట!
ఖగకర్తచే జాడ గాంచిరి యిచ్చట
             సేనలఁ గలసితి చాన యిచట
నెలలనాల్గింటి జడగట్టి నీరధార
లడర నీగిరి నిలిచితి నధికచింత
[1]నర్కి కిచ్చితి కిష్కింధ నదియె దాని
కాంతి యెంతేని తెలియంగఁ గానరాదె.

231


మ.

అనిన న్నక్కడ నిల్చి కీశతతి సాహాయ్యక్రియన్ దాల్చినన్
జననాథాగ్రణి యట్లరా ననిచినన్ జాలాయెదల్ రంజిలన్
గనకాలంక్రియలెల్ల సీత యలరన్ గాన్కల్ తగన్నిచ్చి యా
యినజాతాగ్రతీసహాయ్య చెలియన్ నేతెంచె యం దెక్కినన్.

232


వ.

అయ్యెడఁ దరలి దనసతికి యారాజశశి యిట్లనియె.

233
  1. లర్కి కిచ్చితి కిష్కింధలదియ (ము)