పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గంది యరచె నది దశరథ
నందన నరనేత నీతినయగతి నణఁచెన్.

197


ఉ.

అంతటఁ దాటకారి తనయండనె నిల్చిన దైత్యకేసరిన్
జంతదలంగఁ జేసి యతిశీఘ్రత దేరఁగ నగ్నిసంస్క్రియల్
సంతసిలంగ నన్నకిటసాగఁగఁ జేయగరాదె యన్న తా
రంతట తాళిశాస్త్రగతి రాక్షసనేత రచించె తత్క్రియల్.

198


తే.

అగ్నిసంస్కారసత్క్రియయాది గాఁగ
నెల్ల క్రియలు నెసగించి చిత్తసరణి
తిరిగియేతెంచినట్టి దైతేయనేత
గాంచి తనదాయిరానెలఁ గడఁగి చీఱ.

199


తే.

దాశరథి యెంతొ హర్షించి దాయి గాంచి
దశగళకనిష్ఠఖచరారి ధరణినేతఁ
గలసి చని లంక కేలిక గాగఁ జేయ
ననఘ యేతేరరాదె యటంచు నాడె.

200


సీ.

అర్కనిశాకరు లష్ట[1]దిక్కుల గ్రహ
             తారకాతతి యెంతదాక నిలచు
నజహరిహరదిగీశాకాశధరకంధి
             ధరణీంద్రగతి యెంతదాక నిలచు
నిలయాదిగా జగా లీరెంటినిలతన
             తలలు దాల్చిన నెంతఁదాక నిలచు
నాచర్యలెల్ల యిన్నరనాగఖగతతి
             దలఁచంగ కథల నెందాక నిలచు
నంతదాక ననేకఘనాతిశయత
లంక నీతని కిచ్చి యలంకరించి
చాయి రారాదె యన నాజ్ఞఁ దలధరించి
కదలి యతనిని దద్రాజ్యకర్తఁ జేసె.

201
  1. దిక్కెరి (ము)