పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జయజయ సాయకాసననిర్గళితచండ
             కాండఖండితదశకంఠకంఠ
జయజయ శేషాహిశయన కాంచనచేల
             రత్నకిరీటహారగణశాలి
జయ హృషీకేశ! జలజాక్ష! జయ యనంత!
జయ జనార్థన! జయ శార్ఙి! జయ గదాంక!
జయజయ హిరణ్యరాక్షసజఠరదళన!
నర్తితహ్రాదినీశాతనఖరశిఖర!

182


తే.

ఆదిగాథల్ గ్రహించి లేఖారియైన
తస్కరాగ్రణికంనిధి దాగఁ దెలిసి
జలచరాకృతి నాతని సంహరించి
ఛాత కన్నింట నిచ్చితి దయ యనంత!

183


తే.

[1]శైలహారికఁ గీడైనలీలఁ దెలిసి
క్షీరనిధిఁ ద్రచ్చ గిరిఁ దాల్చి కీర్తి హెచ్చ
సరగఁ దలదాచినట్టి యాసరణి నిల్చి
చెడనిక్రియ చెలఁగఁజేసితి శ్రీసనాథ!

184


తే.

ధరణి హరించదలచిన దైత్యనేత
నంటి కిటిరీతి హరియించి హర్షగతిని
యచల నిజగతి నెత్తినయాఖ్య లెన్న
నేర్చగలరయ్య యేరైన నీరజాక్ష!

185


ఉ.

రేగినయట్టి కాంచనశరీరనిశాచరకర్త యీర్ష్యచే
సాగిట ధిక్కరించి తనసంతతి చిన్నననంచదల్చఁగా

  1. 184 పద్యమునకే 'పాఠాంతరముగా' ఈ పద్యము 'ము'లో గలదు.
    చ. “దితితనయాదితేయతతి దెచ్చి గిరిన్ ఘనచక్రితాటనా
        యతగతి గట్టి రెండెడల యక్కఱ దీర్చఁగజాలినంతనే
        యతిరయశక్తిచే జలచరాకృతిలీల ధరించి దాని యా
        తతకఠినాంసధాత్రికడఁ దాల్చిన నీతెఱఁ గెన్న నేటికిన్."