పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ననఘనయష్టి గండ్రలయి జారఁగనేసె నిశాటసేన ల
ల్లన చెలగంగ నిర్జరకళల్ దరుగన్ హరిరాజి గాసిలన్.

168


వ.

అంత.

169


ఆ.

కలశజర్షిదత్తఘనశరాసనయష్టి
సంగ్రహించి నారి శస్త్రిఁ జేర్చి
జనకధరణినాథజాజాని యత్యంత
చిత్రసరణి నాజిఁ జేయసాగె.

170


వ.

ఇట్ల నిశా౽హఃకాలచర్య లెడతెగక షష్టదినసంఖ్యల్ దాటిన నాటి
చెంత.

171


క.

అని యతని శిరఃకరతతి
గనియల్ సేయఁగ నిగిర్చగా దాశరథిం
గని కలశకర్ణసహజా
తనిశాచరక ర్త నయహితస్థితి దేరన్.

173


వ.

ఇట్లనియె.


క.

క్షితినాథ! సంశయించక
యతని జఠరధాత్రిచారణాహారరస
స్థితి తనరె న్దనక సదా
గతిహితశరధార నేయఁగ లెస్స యనన్.

174


ఉ.

అన్నరనాథకేసరి శరాసనసంఘటితాగ్నిశస్త్రి న
చ్ఛిన్నదశాననత్రిదశజిజ్జఠరాంతరసంస్థితాదితే
యాన్న[1]రసగ్రహక్రియ నయస్థితి సంధిలఁజేయ నార్తినా
చెన్నటి రిత్తయై నిలిచెఁ జెంగటి కీశఘటల్ హసించఁగన్.

175


వ.

ఇట్లు నిలిచిన చంద్రహాసిం గాంచి.

176


క.

ఇన్నాళ్ల దనుక నే నిఁట
చిన్నెలకై తెగక యాలసించితి నింకన్

  1. రసంగ్రహ (ము)