పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దీనాకృతిచే నేదియు
గానక దశకంఠదైత్యకర్త కలంగెన్.

162


తే.

[1]అజతనయనందనాగ్రణియంగయష్టి
చింతగింజంత యెడలేక చిత్రసరణి
తగల నెసఁగించె దశకంఠదైత్యకర్త
సరగ నీరీతి గలహించసాగి రంత.

163


క.

ఖరరాక్షసగంజనసిత (?)
శరధారల్ కైకసేయశక్రాహితకం
ధర లెఱిఁగించఁగ నాతీ
రరసి గణించంగసాగి రందర లంతన్.

164


ఉ.

ఆనరనాథకేసరిశరాహతి నిండఁగ నాట నిస్సహ
గ్లాని ధరించి రాత్రిచరకర్త యహంక్రియ సంధిలంగ[2]గా
(?)ళీనదయాంతసంత్రిశిఖహేతి గదల్చి తెరల్చి యేసె ఘం
టానినదక్రియల్ గిరిఘటల్ నటియించఁగ నింగి గాసిలెన్.

165


చ.

అది కడగాకరాఁ గని ఖరారి నగాహితదత్తశక్తి న
ష్టదిశల నిస్సహాగ్నికణసంహతి రాలఁగ నేసె నేయఁగా
నెదిరి సహస్రఘృష్టిని గ్రహించి నరాశనకర్త లీలచే
నెదగ హరించే నాత్రిశిఖహేతి నిరాకృతి గాగ నయ్యెడన్.

166


తే.

ఏసి యంతటఁ జాలక యీర్ష్య రేగి
దాశరథి శస్త్రికలచేత ధాక నేయ
దాని కలిగి నిశాచరధరణి దాని
తలకి గద్దించి నిరసించి తత్తరించి.

167


చ.

ఇనశశితారక ల్చెదర నెల్ల దిశ ల్చలియించ శాక్రహ్రా
దిని కెనయైనశస్త్రికధృతిన్ ధరణీతనయాధిరాట్చరా

  1. అదితనయనంగ (ము)
  2. పాఠ మన్వేషణీయము