పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నశనిసంకాశకఠినాట్టహాససరణి
దశహరిత్కర్త లలజడి దద్దరిల్లఁ
దరలి దశకంఠలేఖారి ధాక చాకి
తాటకేయారి నలదండధారి దారి.

156


ఉ.

అన్నరకర్త తేర దితిజారి రధస్థలిఁ దాకెఁ దాక న
క్లిన్నగతిం ధరిత్రి దిరిఁగెన్ హతిచే దిశలెల్లఁ గాసిలెన్
కన్నిధి నల్గడల్ చెదరె ఖస్థలి తారకలన్ని రాలె నా
కిన్నెరసిద్ధసాధ్యఖగఖేచరసంతతి దద్దరిల్లగన్.

157


క.

అనలకణచ్ఛట లెగయఁగ
ననిలరయక్రియలచే ధరాధీశనరా
శనకర్తల యరచాలం
టనదాక నజాండ [1]గలసినట్టయ్యె నటన్.

158


క.

హరిహరిగలసిన జాడల
కరటికరటి దారసిలినకరణిం జాలా
గిరిగిరి నెనసినగతి దా
శరధి ఖగారాతి యెదరి జగడించి రటన్.

159


క.

ఇతరేతరకరగళితాం
చితచండశరాసనాతిశితకరధారా
క్షతశాస్త్రశస్త్రి కదన
క్షితి యయ్యెం త్రిదశరాజి గీర్తించంగన్.

160


ఉ.

ఆనరఖాదనాగ్రణి నయక్రియ సంధిల నంధకార నా
గానలకాండధారల జయస్థితి నేయఁగ గాంచి జానకీ
జాని దినేశతార్ఘ్యఘనశస్త్రికలం దెగనేసి యార్చె లే
ఖానకదంధణల్ చెలఁగ యష్టదిగీశతనెల్ల నెన్నఁగన్.

161


క.

ఆనిర్జరారిఁ జేసిన
దానికి నన్నిఁటికి నన్ని తగఁజేయంగా

  1. గలసెటట్టయ్యె (ము)