పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈలంక యేల ధనధా
న్యాలంక్రియ లేల కరటిహయరథరాజ్య
శ్రీ లేల నీసహాయత
జాలించఁగరాదె నీరజాతదళాక్షీ!

125


ఆ.

ఎల్లదిగధికర్త లిట దాస్యచర్యల
జనశతార్ధలక్షసంఖ్యలైన
యేండ్లదనక ధరణి యేలి నే నతనికి
శరణనంగ నేల హరిణనయన.

126


చ.

సతి! యచలాహితాద్యఖలచారణరేఖల నేల నేసి రా
చితి సరియెన్న నేల సరిచేయ జగత్త్రయి నేర రెన్న, హా!
యతనికి నేనె సాటి యతఁ డారయ నా కిట సాటి సాహసా
యతధృతి సాయకాసనదృఢాగ్రహనిగ్రహకార్యచర్యలన్.

127


చ.

అని రజనీకరాననగృహంతరసంస్థలికన్య చక్కఁగాఁ
దనయెద కాంక్ష లెల్ల సహితస్థితి సాగనియట్టిదాని క
త్యనత గిరీశధాతలఁ దృణాకృతిఁగా హసియించె నాదికా
శనసదృశాచ్ఛతారకరసారససంస్థితి ఖడ్గశాలియై.

128


సీ.

శాంకరీశంకరస్థలియైన రజతాద్రి
             హత్తంగ గెంగేల నెత్తినాఁడ
నచలాహితాదిదేశాధినేతలచేత
             నానతిఁ గని కాన్క లందినాఁడ
లలితసాహసధైర్య[1]లక్షణం దనరార
             సిద్ధిచే సత్కీర్తిఁ జెందినాఁడ
సాధ్యసిద్ధాండజసారణాహిశ్రేణి
             దాస్యక్రియ జరించఁ దనరినాఁడ
నట్టియంత నారాక్షసాధ్యక్షహేళి
నిట్టినరకీటకాగ్రణి యెంత జేసె

  1. లక్షనందనజాల (ము)