పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గనలగ నీడ్చి తెచ్చి తెగ గాసిలఁజేయఁగ యాగదీక్ష చ
క్కనఁ జెడి లేచి నిల్చె లయకాలనిశాకరశేఖరాకృతిన్.

114


క.

నిలిచిన గిరిచరఘట లి
చ్ఛల కన్నదెగాతిగాగ జని కేరఁగ నా
జలజాక్షి లజ్జచే దశ
గరఖచరారాతి గాంచి కందఁగనాడెన్.

115


సీ.

కాకచే నగ్రజకర్తల హింసించి
             యగ్రహారస్థిర లాగడించి
కలికి యచ్చరకన్నియల దెచ్చి [1]చెఱఁ దాచి
             యజ్ఞాదిసత్క్రియ లడ్డగించి
సరసిజాక్షస్థానశాలలన్ని హరించి
             కాసారదీర్ఘికల్ గాసిఁ జేసి
అతిథిజనార్చన లడఁగించి శతఖడ్గ
             ధారలచే నాలఁ దరిగితరిగి
[2]శాంతిదాంతి దయానయజ్ఞాన దాన
సంతతాచార నిష్ఠాతిశయత లార్చి
నట్టియఘకారి నీచేతలట్టె నీకె
[3]సాటిదాకెగదయ్య నిశాటనాథ!

116


క.

నారాయణ సత్కళచే
[4]నారాజచ్ఛట జనించె నఖిలాశాలే
ఖారాతిఘటలనందఱ
నారసి గండ్రించె సంశయక్రియలేలా.

117


చ.

అని ఘటకర్ణ[5]శైలజితలాదినిశాచరనేతలందఱల్
చనిరి హయచ్చటల్ నలిసె సైనికకర్త లడంగి రచ్ఛకాం

  1. చరనాగి (ము)
  2. శాంతిచేదాంతి (ము) శాంతిదాంతిదయానయ (శి)
  3. సాటి దాకించెగాని నిశాచరేంద్ర (శి.గ.)
  4. నారాజచలంజనించె (శి)
  5. శైలదజిదాది (శి)