పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

తండ్రి! జననియైన తాటకఁ దెగటార్చె
చిన్నతండ్రి నల్కచే హరించె
కన్నతండ్రి చండకాండధారలఁ జెండె
నెనయ నంగ[1]గలదె యిద్ధచరిత.

83


చ.

హరి నిరసించెదన్ శిఖి జయక్రియ డించెద గాలిఁ గేరెదన్
శరనిధినేఁ దనర్చెద నిశాచరకర్త నదల్చెదన్ కళా
ధరదిననాథజాతధనదత్రయి గిట్టెద గాని యట్టిదా
శరథియ దాట నానడక సాగకనేరదయా దశాననా.

84


చ.

అనయత సీతఁ దెచ్చినదియాదిగ, రక్కసిఱేండ్ల తాటకా
హననకరాగ్రకీలితశరాసనచండతరాస్త్రకీలిచేఁ
దినఁదినజేసి దాని గడదేరకఁ దక్కినయట్టి యందఱన్
దినఁగ దలంచితే యకట! తెక్కలి నీతెఱఁ గెన్ననేటికిన్.

85


చ.

ఇలగలరాక్షసచ్ఛటల నెల్ల ననిం దెగటార్చి గట్లచే
జలనిధి గట్టి, యద్రిచరజాలసహాయత లంకచెంగటన్
గలయఁగనిండె నాకలశకర్ణనగారిజిదాదిదైత్యరే
ఖల హరియించఁగాఁ దెలిసి గట్టెద లజ్జ ఘటించనేరదే!

86


ఆ.

అనిన నాలకించి యల్కచే లంకాధి
నేత హేతిధార నేయ ననిచి
నట్టిసంజ్ఞ దెలిసి యాకార్యసరణి నం
గీకరించి కదలెఁ గృతకసరణి.

87


వ.

ఇ ట్లాతాటకాతనయనిశాటకర్త చనిచని యాంజనేయహరికంటె యతి
శీఘ్రతఁ గదలి తదగ్రస్థలి సకలచేతనగ్రాహియైన నక్రాగ్రణిగల సరసి[2]కడ
కృతకశృంగారకాంతారధరణి జట్యాకృతి నధిష్టించె నంత.

88


సీ.

అంజనానందనహరికర్త చనిచని
             యలయికచేఁ దృష్ణ యైన కృతక

  1. నెనంత (ము)
  2. కడగిలి (ము)