పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అయ్యెడ.

48


తే.

అష్టదిగ్రాజకీర్తన లతిశయిల్లెఁ
జారణానకదంధణల్ సందడిల్లె
నచ్ఛరల నర్తనక్రియ లలరె దాశ
కంఠి రణధాత్రి ద్రెళ్లినకతన నంత.

49


క.

ఘననాదరాక్షసాగ్రణి
యని ద్రెళ్ళినయట్టిజాడ యాలించి దశా
ననదైత్యకర్త యాగ్రహ
కనదాకృతి [1]లంక జెదఱఁగా ధర యదరన్.

50


సీ.

ఘనతరనిస్సాణగణధణంధణలచే
             జలరాశి నీరెల్ల గలయసాగ
నసిశాతనిస్త్రింశశతతళత్తళలచే
             గగనరత్నాకృతి గాసి గాఁగ
గంధరాధికనీలకదటిఘీంక్రియలచే
             దశదిశ లంతంత తల్లడిల్ల
ననతకంఖాణరింఖాగ్రఘట్టనలచే
             శేషాహిదృఢశిరశ్రేణి యగల
నఖలనిర్ఘాతధిక్కారి నిస్సహాట్ట
హాసలీలల [2]నచలాచూరి తలక
సంగరాంగణధాత్రి నేశంక లేక
కైకసేయనిశాచరకర్త నిలిచె.

51


తే.

నిలిచి తనదాయి రాకాసికలన గాంచి
యాచఁగాలేక చేశక్తి నార్చి యేసె
దాని నతికాయహంత యత్యంతదీక్ష
గండ్రికల్ జేసె జేసిన కలఁక రేగి.

52
  1. కచరాధరారి (ము)
  2. కచరాధరారి (ము)