పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తనచెల్లెలినాసిక గీ
సినదానికి లజ్జ గన్న చెన్నటి యాహా!
తన [1]యాసలేని చెంగట
జననేర్చెనె యన్నఁ జేర జలియించకటా!

14


చ.

అనతదృగగ్నికీల లఖిలాశల నిండఁగ నిర్జరారి దా
రన దృఢనాసికాగళితరక్తజలార్ధశరీరయష్టియై
కనలి నయక్రియం దిరుగఁగా హరినాయకసేన లార్చి చె
ట్ల నచలశృంగగండశిలలన్ దెగనేయఁగసాగి రయ్యెడన్.

15


చ.

అలయక రాక్షసారి కలహాంగణధాత్రి ననేకశస్త్రఢా
కల ఘటకర్ణరాత్రిచరకర్త గదాంచితదీర్ఘహస్తశా
ఖలఁ దృణలీలలన్ బెరకి కాళ్ల దరట్టగ ద్రెంచి యానన
స్థలిం జితికించి నాల్కఁ దెగఁజాచిన గండ్రికఁ జేసి యల్కచేన్.

16


తే.

దాశరథి చండసాయకధారచేత
కలశకర్ణాదితేయాదికంఠనాళ
సంహరించిన హరికరాళనిహతాద్రి
సరణి ద్రెళ్లె దిగీశితల్ సంతసిల్లి.

17


క.

తల గెంటి సాగరాంత
స్స్థలి ద్రెళ్లిన యాస్యరంధ్రసరణిన్ జన[2]నీ
రలరంగ నిండ నల్గడ
లిలఁగన రాఁగ గదియసాగె నెన్నఁగ నంతన్.

18


తే.

అచ్చరల నర్తనక్రియ లతిశయిల్లె
నింగి నిస్సాణధణఢణల్ నిండె ఖగల
తాంతసంతతి జెడి తనరారె నష్ట
దిశల చీఁక ట్లడంగె నెంతేని గనఁగ.

19


క.

ఈరీతి దాయి దెగ లం
కారా జత్యార్తిఁ గలసి గాఢాగ్రహకీ

  1. యాశ లేనిచంగట (ము)
  2. నీళలరంగ (ము)