పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యచట గాంచిన హరిసేన లచట నచట
లంక నిండంగ సాగి రేశంక లేక.

138


క.

[1]నగరీస్థలి నిండిన యా
యగచర[2]సేనాట్టహాస హాసక్రియలన్
జగడించి దిగ్గనడచిరి
జగతి చరించంగ రాత్రిచరఘట [3]లల్కన్.

139


మ.

ఘననిస్సాణఝణంఝణల్, కరటి ఘీంకారక్రియల్, శాతసా
ధననీరంధ్రతళత్తళల్, గతినటత్కంఖాణహేషల్, నరా
శననిర్ఘాతదృఢాట్టహాసరచనల్ సంధిల్ల ఢాకన్ దశా
స్యనిశాటక్షితినేత ధాటి గదలెన్ హర్షాతిరేకస్థితిన్.

140


క.

ఏతెంచినట్టి లంకా
నేతం గని యర్కజాదినిఖిలహరిఘటల్
సీతానాథాజ్ఞారతి
చేత నిలచి రాశలెల్ల జెదఱఁగ నంతన్.

141


చ.

[4]అనిలసఖాకృతిన్ గనలి, యాదశకంఠనిశాటనేత కాం
చనరథగంధనాగహయసైనికకర్తల హెచ్చరించఁగా
గని, హరిజాదికీళతతి గాఢరయక్రియచేత నేఁగి చె
ట్ల నచలశృంగగండశిలలన్ దిగియేయఁగ సాగి రయ్యెడన్.

142


సీ.

చెక్కలై గాండ్రలై చిద్రలై నలిఁగిన
             దిశలనిండినయట్టి తేర్లచేతఁ
గడరెక్క లెడలిన గట్లనాద్రెళ్లిన
             గంధగంధిలదంతిఘటలచేత
గాఢలంఘనల జంగల్గనెలై ధాత్రి
             తల్లక్రిందైన తత్తళ్లచేత
నాకారలేఖ లింతైన కానఁగరాఁగఁ
             జతికిన రాక్షసచ్ఛటలచేతఁ

  1. నగరస్థలి (శి)
  2. సేనలఘనాట్టహాస (శి)
  3. లంతన్ (శి)
  4. అనలస ఆకృతిం (శి)