పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

చెలియ! శక్రాదినిర్జరశ్రేణికైన
స్రష్టకైన నగేంద్రజాజానికైన
కాలగతి దాటఁగారాని కతనఁ జేసి
ధాత్రి నస్థిరదేహినై [1]తలడ నేల!

134


చ.

అతని రణాంగనస్థలి నయక్రియ సంధిల నేనె గెల్చినన్,
హితగతితో జగత్త్రితయి నేలెద రాక్షసకర్త లెన్నఁగా
నతఁడే రణాంగనస్థలి నయక్రియ సంధిల నన్నె గేల్చె నా
హితగతి నైక్యలీల ధరియించెలఁ జిల్లరగాథ లేటికిన్.

135


క.

అని చంద్రహాసి నిజగే
హినికిన్ హితశాస్త్రసరణి యెఱఁగంగాఁ జే
సి, నితాంతస్నేహక్రియ
ననిచెన్ రాజగృహధాత్రి కక్కడ నంతన్.

136


క.

కానంగా నీఁగె తెరల్
తేనియతట్టాగినట్టి తేటన్ ధృతి లం
కానగరస్థలి నిండిరి
యా నగచరసేనలెల్ల నాశ్చర్యగతిన్.

137


సీ.

సాలహింతాలరసాలహరీతకీ
             క్షితిజశాఖారాజిఁ జెలఁగి చెలఁగి
కలితరాజిగృహాగ్రగాంగేయకలశకే
             తనదండసంహతిఁ దఱిఁగి తఱిఁగి
రధ్యలధనధాన్యరత్నచిత్రికలచేఁ
             దారహారశ్రేణిఁ దార్చి తార్చి
దానరాజితనాగసైనికస్యందన
             కంఖాణసంతతిఁ గలఁచి కలఁచి
ఘనఘనాఘననిర్జాడ్యగర్జ లెసఁగఁ
జేసి, దితిజాంగనల గాసి చేసి చేసి,

  1. తలఁగ