పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఖరహంతయె సాక్షాత్క్రియ
హర యని తెలియంగలేక యాహా ధృతి సం
గరకరణదృష్టి నిలిచిన
సరణి కిచటి కరిఁగితిన్ నిశాచరనాథా.

121


చ.

అలయక నాకనాథదహనార్కజనైరృతకంధినాయకా
నిలధనదాంగబాద్వఖలనిర్జరసంహతి, యయ్యజియ్యలన్
గలఁత శతాందగంధగజకాండనటీనటరత్నశాటికల్
కలయఁగ [1]నిచ్చి నంతటనె, కానక నిక్కితె రాక్షసాగ్రణీ!

122


క.

అనిన యఘచింతన ని
న్నానందించంగఁజేయ నకట దశాస్యా
యేనెఱిఁగించిన హితగతి
గానక నేర్చెదె చెడంగఁ గడతఱి యయ్యెన్.

123


క.

కన్నిచ్చయైన చక్కని
కన్నెల్ నీసడన ధాత్రి గల్గగ సాక్షా
త్కన్నిధి కన్యక సీతన్
గ్రన్ననఁ దేనేల జాలిఁ గ్రందఁగ నేలా!

124


క.

ఏటికి జానకి దెచ్చితి,
యేటికి యారాక్షసారి కెడ జేసితి హా!
యేటికి కలిగిన యలజడి
యేటికి యంతరల జేర నిద్ధచరిత్రా!

125


క.

గట్టిగ జలనిధిగట్లం
గట్టించె, నసంఖ్యలైన ఘనహరిసేనల్
నెట్టన లంకానగరికి
కట్టై నిలిచె, నిక నెట్లు కడతేఱంగన్.

126


ఉ.

[2]శైలజిదాదిఖేచరనిశాచరసంతతి సంతసిల్ల నీ
యేలిక యద్రిజేశిత యహీనశరాసనయష్టి యంఘ్రిచేఁ

  1. నిల్చి (ము)
  2. శైలజిదారి (శి)