పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సరసశేషశాయిసన్నిధి కాయండ
జస్థిరాధినేత చనియె నకట.

113


క.

హరిహయదిశాద్రి చెంగట
హరిగానఁగనైన రాక్షసారాతి ధృతిన్
హరిసేనాసంగతి సం
గరధాత్రి న్నిలిచె సనయగతిచే నంతన్.

114


క.

తనహిత[1]సంతతి దశరథ
తనయక్షితినాథ కీశతతిచేతన ద్రె
ళ్లిన దానికి గలిగి దశకం
ఠనిశాచరకర్త సంకటక్రియ దేరన్.

116


వ.

ఇట్లు సంగరసన్నాహక్రియలఁ గఁదలం దలంచిన లంకానేతతెఱం
గాలించి శక్రజిజ్జనని [2]సకలశ్రీ లాచ్ఛాదించ నేతెంచినయాకె సింహాసన
స్థలి నధిష్ఠించఁజేసి సరసగాథ లాలించి యాననస్థితిఁ గాంచి.

117


క.

జలజాక్షీ నీహృదయ
స్థలి లెక్కించంగరాని జడయిక నిటరా
[3]దెలిసె, యహా! నరకీటక
తిలక హరిశ్రేణిచేత ధృతి చెడెగాదే.

118


క.

న న్నచటికి రా ననిఁచిన
కన్నియ [4]రాలేనె యలసగతి నేతేరన్
జన్నే యని లాలించఁగ
యన్నరహంతఁ గని యాడె యాదరసరణిన్.

119


చ.

తెలియక సీతఁ దస్కరత దెచ్చిన నీయెడ చెట్లచెంగటన్
నిలిచి దిగీశజాతహరి నేసినయట్టి నిశాటహంత గా
సిల నరి జేర నేఁగి నతి జేసిన కైకసిఁ గన్న చిన్నదా
గలిగిన యార్తి దాల్చఁ గనికం జడియెన్ దెఱఁ గెద్ది నా కిటన్.

120
  1. సంహృతి
  2. కలగ (ము)
  3. తెలిసెన్ హా నరకీటక (శి)
  4. నేరానె (శి.గ)