పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దన కెన యైనయట్టి జడదారి జతల్ గని సాగిలన్, రణా
శన జటికర్త, దాశరథి సన్నిధి నిల్చి గణించె నేడ్తెరన్.

108


తే.

అజ! జగన్నాథ! నిఖికేశ! యార్తరక్ష!
త్రిణయనారాధ్య! యనమ! నీతేజియైన
తార్క్ష్యఖగనేతఁ దలఁచినఢాక, నాగ
శరాహతి హరించగలదన్న చక్కఁదలఁచె.

109


వ.

ఇట్లుఁ దలంచిన.

110


సీ.

నిండిన ఢాకచే నెగసిన నింగిదా
             జిగి యజాండ [1]ఘటకట్ట గడయంట
రెక్కల్లార్చిన నిక్కిన గట్లెల్ల
             గెంటు గృధ్రాండజక్రియల నాడ
నచల కాళ్లానిన యహిరాజశీర్షసం
             తల్లి కండలగిలి కిందటికి దిగగ
ఘనశీఘ్రగతి దేరఁ జన దానిజాడల
             [2]ధరధరాద్రిచ్ఛటల్ తెరలి కదల
హరిశిఖికృతాంతనైరృతశరధిరాట్స
దాగతి, ధనేశకాళికాధ్యక్షసాధ్య
ఖచరకిన్నరచారణగణన లెసఁగ
నీడజాగ్రణి యేతెంచి నిశితచర్య.

111


చ.

అలయఁగ నింగిదారి జనినట్టి సితాస్యఖగాధినేతరె
క్కల నెఱిగాలి రానెలల గట్టిన [3]నీలగళాస్త్రరేఖలన్
గలయఁగ డాకినంతటనె [4]కంనిధిగాతుగనారసాతల
స్థలి కరిగెన్, దిగీశఖగసంతతి సంతసిలంగ నయ్యెడన్.

112


తే.

లేచి నిలిచినట్టి లేరాచనెలసర్ల
గాంచి కాళ్ల కెఱఁగి గణనఁ జేసి,

  1. ఘటికోట్ల కడనయంట (శి. గ.)
  2. ధరాధరచ్ఛటల్ (శి)
  3. నీలగశాస్త్ర (ము)
  4. కన్నిధిగాతగయా (ము)