పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాకధరిత్రీతలదిశ
లేకాకృతియైన నాత డిద్ధక్రియచేన్.

102


క.

కాలానలచండశిఖా
జాలిక, సచ్ఛత్రికల దిశల్ తలకంగా,
లీలన్ గిరిచరనేతల
నేలన్ ద్రెళ్లంగనేసె నిశితక్రియలన్.

103


చ.

అనిదశకంఠనందనఖగాహితకర్తహృదంతరాళసం
జనితదృఢాగ్రహాగ్నికణసంతతి కన్గడలన్ దిగంగ ధా
రనగరిచారి రాడ్ఘటల రానెలలన్ హరిసాయకాహతిన్
ఘనతరశక్తి గట్టి తిరుగ న్నిజసంస్థలి కేఁగె నయ్యెడన్.[1]

104


తే.

కైకసేయాజ్ఞ త్రిజట దాఁ గగనయాన
సంస్థలక్షితనందన జక్క జేర్చి
[2]రనశరాహతి ద్రెళ్ళిన రాచనెలల
[3]గానగా జేసి తిరగయక్కానడించె.

105


వ.

అంత.

106


క.

తనజ్ఞానదృష్టిఁ దశరథ
తనయక్షితినేత లర్థి ధరణీస్థలి జా
రినజాడఁ దెలసి, కలహా
శన జటి యేతెంచె నింగి సరయక్రియచేన్.

107[4]


చ.

తదఘనదేహయష్టి ఘృణి ధాత్రిదిశల్ కలయంగ నిండఁగా
దనకలకంఠగాననినద క్రియ చక్కఁగఁ దేనె లీనఁగా

  1. 104 తర్వాత 'శి' ప్రతిలోగల పద్యము.
    క. తనతండ్రి కాజయక్రియ
        యనతస్థితిఁ దెలియఁజేయ హర్షించి దశా
        నననిర్జరారి నయగతి
        తనయాగ్రణిఁ గౌఁగిలించె దయచే నంతన్.
    (5 ఆశ్వాసము 30 పద్యమునకు దీనికి పోలిక గలదు.)
  2. కర (శి)
  3. కనగ శాసించి....
  4. 106, 107 సంఖ్యకు గలభాగములు శి.గ.లలో లేవు.