పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఖగధనాదీశ కాళికాకాంత సకల
ఖచరనేతల కట్టెదల్ గానిఁ గలఁగ.[1]

96


తే.

అజి కేతెంచినట్టి శైలారిజి న్ని
శాటకర్త నదల్చి యేశంక లేక
నగచరశ్రేణి గదియ రంతయ్యె, దిశల
నింగిచారణసంతతి చెంగలించె.

97


చ.

కటచరణాధరాధరనఖస్తనకీకసకర్ణనాసికా
నిటలకరాస్యదంతకచనేత్రకటీర[2]గళాస్యజంఘికా
చ్ఛట లసిధారలన్ క్షితిజశాఖలచేఁ దెగి జన్యధాత్రి నం
తట కలయంగ ద్రెళ్లి రఁట దైత్యహరీశిత లేకచర్యలన్.

98


తే.

ఆరసాతలజలనిధి యచలకెగసి
కలియ దిశలెల్ల నిండినకరణి నధిక
సాంద్రరక్తతరంగిణీసలిలధార
[3]కేఁగె నాయాజి హరిసేన లెచ్చరించ.

99


క.

ధృతి నగచర[4]ధాత్రిచరే
శిత లితరేతరదృఢాజి సేయఁగ నెంతే
క్షితిచరఖేచరతతి యా
తతగతి గానంగసాగె నాయాయెడలన్.

100


తే.

అల్కచే నింద్రజిత్ఖచరారికలిత
హయధృతరథాంగసంగతి యంతరిక్ష
సరణి కెగసి, జలంధరచ్ఛాయ నిలిచి
చిరతరాదృశ్యగతి నాజి సేయసాగె.

101


క.

ఆ కటికరేయి నిండిన
చీఁకటికిన్ రెట్టియైన చీఁకటి సేయన్

  1. 96 నెం. పద్యము 3 వ చరణము 2 వ చరణముగా, 2 వ చరణము 4 వ చరణముగా, 4 వ చరణము మూడవ చరణముగా గలవు. (శి}
  2. గళాస్త్ర(శి)
  3. లెసఁగె (శి)
  4. రాత్రి (శి)